రోజు కూలి రూ.600 చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-27T05:35:30+05:30 IST

ఉపాధి హామీ పథకం పనుల్లో పని చేస్తున్న కూలీలకు రోజు కూలి రూ.600 చెల్లించాలని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా డివిజన్‌ కార్యదర్శి సలీం డిమాండ్‌ చేశారు.

రోజు కూలి రూ.600 చెల్లించాలి
మాట్లాడుతున్న సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా డివిజన్‌ కార్యదర్శి సలీం

- సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా డివిజన్‌ కార్యదర్శి సలీం

ఊట్కూర్‌ మే 26 : ఉపాధి హామీ పథకం పనుల్లో పని చేస్తున్న కూలీలకు రోజు కూలి రూ.600 చెల్లించాలని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా డివిజన్‌ కార్యదర్శి సలీం డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా, ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో పని చేస్తున్న ఉపాధి హామీ పఽథకం కూలీలను పనిచేసే చోట కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు నాలుగు వారాలైన వేతనాలు ఇవ్వలేదని, ఎండకాలంలో నీడ కోసం టెంట్లు, నీటి వసతి కూడా కల్పించలేదని అన్నారు. కూలి కూడా రోజు వంద రూపాయల లోపే వస్తోందన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఉపాధి హామీ కూలీలు ఐదు గంటలు పని చేసిన రూ.60 నుంచి రూ.70 కూలి రావడం ఎందని ప్రశ్నించారు. వేసవి దినాల్లో ఎండల్లో పని చేసినందుకు కలపాల్సిన 40శాతం కూలిని కూడా పెంచి ఇవ్వడం లేదన్నారు. ఈ పథకం నిర్లక్ష్యానికి గురి అయ్యి కూలీలకు ఉపాధి చూపించడం లేదన్నారు.  ప్రభుత్వం కూలీలకు రూ.600 వేతనం చెల్లిస్తేనే నాయ్యం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ మండల కార్యదర్శి మల్లేష్‌, మండల నాయకులు పొర్ల నర్సింహా, బాలకిషన్‌గౌడ్‌, గోవర్దన్‌రెడ్డి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

మక్తల్‌ రూరల్‌ : ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సీపీఐ, ప్రజాపంథా, ఎఐకేఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు విమర్శించారు. గురువారం మండలంలోని దాసర్‌దొడ్డి గ్రామంలో ఉపాధి పని చేస్తున్న కూలీల వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ, ప్రజాపం థా నాయకులు ఎస్‌.కిరణ్‌, ఎఐకేఎంఎస్‌ జిల్లా ఉపా ధ్యక్షుడు భగవంతు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షు డు భాస్కర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పని లేని కూలీలకు పని కల్పించి వలసలను నివారించేందుకు యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాఽ ది హామీ పథకం చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. నేడు 33 జీవో ద్వారా ఈ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనా లు వెంటనే చెల్లించాలన్నారు. వేసవి కాలంలో 30 శాతం అదనంగా వేతనం ఇవ్వాలని, ఉపాధి కూలీలు పనికి వెళ్లేటప్పుడు పని నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.20 లక్షలు ఇవ్వాలన్నారు. ఫిల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు చేయాలని నేషనల్‌ సర్క్యూలర్‌ 333 ఈజీఎస్‌ 2022 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సీపీ ఐ, ప్రజాపంథా, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వెంకటయ్య, బాలరాజు, శివప్ప, గోకరప్ప, రంగప్ప, వెంకటమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:35:30+05:30 IST