ఖాకీల క్రౌర్యం

ABN , First Publish Date - 2021-06-15T06:44:38+05:30 IST

వారంతా మున్సిపల్‌ కార్మికులు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. అది కూడా శాంతియుతంగానే. 19 రోజులుగా ఇదే స్థాయిలో నిరసన చేస్తూ వచ్చారు.

ఖాకీల క్రౌర్యం
మహిళా కార్మికులను అడ్డుకుంటున్న సీఐ కత్తి శ్రీనివాసులు


మున్సిపల్‌ కార్మికులపై దాష్టీకం

సమస్యలపై శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులు

నేతల అరెస్టుకు యత్నం.. 

అడ్డుకున్న కార్మికులుతోపులాటతో ఉద్రిక్తత

స్పృహ కోల్పోయిన ఇద్దరు కార్మికులు

మహిళకు గాయాలు

సీఐ బూతుపురాణంపై మండిపడిన నాయకులు

కార్పొరేషనలో ఓ స్థాయి ఉన్నతాధికారి అత్యుత్సాహం

ఆయన ఫిర్యాదుతో ముందస్తుగా 25 మంది అరెస్టు

అనంతపురం కార్పొరేషన, జూన14: వారంతా మున్సిపల్‌ కార్మికులు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. అది కూడా శాంతియుతంగానే. 19 రోజులుగా ఇదే స్థాయిలో నిరసన చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా జిల్లా కేంద్రంలోనూ చేపడుతున్నారు. ఇప్పటివరకు వారు ఎవరికీ ఇబ్బంది కలిగేలా ఆందోళనలు, ధర్నాలు, అధికారుల నిర్బంధాలు, కార్యాలయ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. సోమ, మంగళవారాల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. అంతే అదే వారు చేసిన పాపం. మహిళా కార్మికులని కూడా చూడకుండా పురుష పోలీసులు జుట్టుపట్టి లాగడం వివాదానికి దారితీసింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏకంగా నలుగురు సీఐలు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారంటే పోలీసుల జులం ఎలా ఉందో అర్థమవుతుంది. కార్మిక నేతలను అరెస్టు చేసేందుకు పూనుకున్నారు. దానిని కార్మికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట తలెత్తింది. అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమ్మెలో భాగంగా కార్పొరేషన కార్యాలయం ఎదుట ఉ దయం 10 గంటల సమయంలో సీఐటీయూ రాష్ట్ర నేత ఓబులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు ఒక్కొక్కరు సమస్యలపై మాట్లాడుతుండగానే.. అరగంటలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వనటౌన, టూటౌన, త్రీటౌన, ఫోర్త్‌టౌన సీఐలు ప్రతా్‌పరెడ్డి, జాకీర్‌ హుస్సేన, రెడ్డప్ప, కత్తి శ్రీనివాసులు తొలుత ఆందోళనను విరమించాలని చెప్పారు. మరోసారి ఒత్తిడి పెంచారు. ఇందుకు నాయకులు, కార్మికులు ఒప్పుకోలేదు. అంతలోనే పోలీసులు.. సీఐటీయూ, మున్సిపల్‌ కార్మికుల సంఘం నాయకుల అరెస్టుకు యత్నించా రు. దీంతో కార్మికులు అడ్డుకున్నారు. పోలీసుల వా హనానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంలో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

ఓ అధికారి అత్యుత్సాహం

పోలీసులు అధిక సంఖ్యలో రావడం వెనుక నగరపాలక సంస్థలోని ఓ స్థాయి ఉన్నతాధికారి వైఖరే కారణమని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన కార్యాలయం ఎదుట జరిగిన ఘటన కంటే ముందే 25 మంది నాయకులు, కార్మికులను అరెస్టు చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులను తమకు సంఘీభావం తెలపాలని కోరడమే ఇందుకు కారణం. పనిచేసే వారిని కూడా చేయనీయట్లేదంటూ ఓ ఉన్నతాధికారి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం యూనియన నాయకులు.. కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఎంహెచఓ రా జేష్‌ వెళ్లి, వారిని విడుదల చేయించినట్లు తెలిసింది.

పోలీసుల ఓవర్‌ యాక్షన

ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలకు పోలీసులు అధిక సంఖ్యలో రావడం సాధారణ విషయం. రాజకీయ, ప్రజా సంఘాలు కూడా కాదు.. మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సాఽధారణ నిరసన విషయంలో పోలీసులు అందులోనూ నలుగురు సీఐల ఆధ్వర్యంలో సిబ్బంది రావడం వారి అత్యుత్సాహాన్ని చూపుతోంది. మహిళలనే కనికరం కూడా లేకుండా కార్మికులపై క్రౌర్యం ప్రదర్శించారు. మహిళా కానిస్టేబుళ్లున్నా... వారి కంటే ముందు పురుష పోలీసులు.. మహిళలపై చేయి చేసుకోవడంతోపాటు జుట్టు పట్టి లాగడం గమనార్హం. ఈ తోపులాటలో మహిళా కార్మికులు అరుణమ్మ, అలివేలమ్మ కిందపడి, స్పృహ తప్పారు. మరో కార్మికురాలి కాలికి గాయమైంది. దీంతో వారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు.. 50 మంది యూనియన నాయకులను అరెస్టు చేసి, టూటౌన పోలీసు స్టేషనకు తరలించారు. నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తమను బూతులు తిట్టారనీ, దురుసుగా ప్రవర్తించారని నాయకులు ఆరోపించారు. పోలీసులు తమను తాకరానిచోట తాకారని మహిళా కార్మికులు వాపోయారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్‌, మున్సిపల్‌ యూనియన జిల్లా కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి తదితరులను అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని నగరంలోని టూటౌన పోలీసుస్టేషన ఎదుట సీఐటీయూ నాయకులు గోపాల్‌, ఆదినారాయణ తదితరులు ఆందోళన చేపట్టారు.

సమస్యలు పరిష్కరించకుండా 

అరెస్టులా?: ఓబులు

దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించమని ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర నేత ఓబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పారిశుధ్య కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలన్నారు. ఈఎ్‌సఐ కార్డులు మంజూరు చేయాలన్నారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ ఇవ్వాలన్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన నా లుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. ఉద్యమాన్ని మంగళవారం కూడా కొనసాగిస్తామన్నారు. 

మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల దాడి హేయం

- సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌

అనంతపురం టౌన : అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులను కొవిడ్‌ ఫ్రంట్‌లైన వారియర్స్‌ అంటూనే ఇలాంటి అమానుష చర్యలకు దిగడం వి చారకరమన్నారు. కార్మికులపై జరిగిన పోలీసుల దాడిపై నగరపాలక సంస్థ మేయర్‌, కమిషనర్‌ వెంటనే స్పందించాలన్నారు. కార్పొరేషనలో పనిచేసే కార్మికులను వారి కార్యాలయం వద్దే పోలీసులు కొడుతుంటే కమిషనర్‌, మేయర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికులపై దాడిచేసిన పోలీసులపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుల దౌర్జన్యం సరికాదు

- సావిత్రి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి

డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడం సరికాదని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులను పోలీసులు అసభ్యంగా మాట్లాడుతూ, మహిళా కార్మికులను జుట్టు పట్టుకుని లాగడం, విచక్షణారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దౌర్జన్యానికి పా ల్పడిన పోలీసులపై విచారణ జరిపి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళా కార్మికులను అడ్డుకుంటున్న సీఐ కత్తి శ్రీనివాసులు

Updated Date - 2021-06-15T06:44:38+05:30 IST