వేలాది మందితో జనగణమన ఆలాపన అభినందనీయం

ABN , First Publish Date - 2022-01-25T06:18:18+05:30 IST

ప్రజల్లో జాతీయ భావం ఉట్టిపడేలా విశాఖ వేదికగా జూమ్‌ ఆన్‌లైన్‌, యూట్యూబ్‌ మాధ్యమాల ద్వారా జనగణమన గీతాలాపన జరిగింది.

వేలాది మందితో జనగణమన ఆలాపన అభినందనీయం
జనగణమన గీతం ఆలపిస్తున్న మేయర్‌, ఎమ్మెల్సీ, తదితరులు

మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి

సిరిపురం, జనవరి 24: ప్రజల్లో జాతీయ భావం ఉట్టిపడేలా విశాఖ వేదికగా జూమ్‌ ఆన్‌లైన్‌, యూట్యూబ్‌ మాధ్యమాల ద్వారా జనగణమన గీతాలాపన జరిగింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకునేందుకు గాను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా యాక్ష్మి, ఐటీసీ గ్లోబల్‌ అండ్‌ డార్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో జనగణమన గీతాలాపన కార్యక్రమాన్ని సోమవారం హోటల్‌ మేఘాలయాలో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వకవి, నోబెల్‌ బహుమతి విజేత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన జనగణమనను జాతీయ గీతంగా 1950 జనవరి 24న రాజ్యాంగం ఆమోదించిందన్నారు. సరిగ్గా అలాంటి రోజున వేలాది మందితో జనగణమన పాడించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ జాతీయ గీతం భారత జాతి సమగ్రతను చాటిచెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి, యాక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ప్రతాప్‌కుమార్‌, ఈస్ట్‌ ఏసీపీ హర్షిత చంద్ర, పి.రతన్‌రాజు, డి.లాజరస్‌, పి.హర్షిత, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T06:18:18+05:30 IST