Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 13 Jan 2022 08:52:01 IST

పుష్ప రాజ్‌గా మారిన క్రికెటర్..

twitter-iconwatsapp-iconfb-icon
పుష్ప రాజ్‌గా మారిన క్రికెటర్..

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్‌గా మారారు. ప్రస్తుతం ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప: ది రైజ్ పార్ట్ 1. గత నెల 17న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన పుష్ప 1 ఊహించని రీతిలో వసూళ్ళు రాబట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో చిత్రంపై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమకి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే క్రమంలో టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా పుష్పరాజ్‌కు ఫిదా అయిపోయారు. తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ పాత్ర పుష్ప రాజ్‌ను తలపించేలా జడేజా మేకోవర్‌తో సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన లుక్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు" అనే డైలాగును జత చేశారు. ఇప్పుడు ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International