మహిళా ఆర్థిక స్వావలంబనతోనే దేశ ప్రగతి

ABN , First Publish Date - 2020-09-24T09:07:05+05:30 IST

మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు

మహిళా ఆర్థిక స్వావలంబనతోనే దేశ ప్రగతి

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ తమిళిసై


బేగంపేట, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కృషి చేయాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. బుధవారం రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు రాజ్‌భవన్‌ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాన్ని గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సంపాదించిన ప్రతి పైసా కుటుంబ సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో స్వయం ఉపాధి శిక్షణ పొంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితోనే రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభించడం జరిగిందన్నారు. అంతకుముందు మహిళా పారిశ్రామిక వేత్తలు తయారుచేసి ప్రదర్శనగా ఉంచిన పీపీఈ కిట్స్‌, పర్యావరణ హితమైన హ్యాండీ క్రాఫ్ట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సెక్రటరీ శ్రీదేవి, డైరెక్టర్లు పల్లవీజోషి, మాధవి, గవర్నర్‌ సెక్రటరీ కె.సురేంద్ర మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T09:07:05+05:30 IST