Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీతో దేశానికి పెనుప్రమాదం

- రైతాంగం, కార్మిక వర్గం, ప్రజలను అగాధంలోకి నెట్టింది..

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు

గోదావరిఖని, డిసెంబర్‌ 5: బీజేపీతో దేశానికి పెను ప్రమాదంగా మారిందని, ఆ విషయాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయ ని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు చుక్క రాములు అన్నారు. స్థానిక అడ్డగుంటపల్లిలోని ఫంక్షన్‌ హాల్‌లో జరు గుతున్న పెద్దపల్లి జిల్లా సీపీఎం పార్టీ 2వ జిల్లా మహాసభలు రెండవ రోజు ఆదివా రం ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీపీ ఎం పార్టీ నిరంతరం ప్రజా, కార్మిక సమ స్యలపై పోరాటాలు నిర్వహిస్తుందని, ఓట్లు, సీట్లను ఏనాడు లెక్కచేయలేదని, కార్మికవ ర్గ పక్షపతిగా పార్టీ పనిచేస్తుందన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న బీజేపీ రై తాంగం, కార్మికులు, ప్రజల జీవనాలను మరింత అగాదంలోకి నెట్టేసిందని ఆరోపిం చారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరా టాలు దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్నాయ న్నారు. వర్గఐక్యత పోరాటాలే బీజేపీ విధా నాలపై విజయం సాధించగలవని రైతుపో రాటం నిరూపించిందన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ కోణంలో పోరాడి లబ్ధి పొందాల నుకున్నాయని కానీవర్గ పోరాటాలే ప్రజ లకు న్యాయం చేస్తాయన్నారు. మోడీ దేశా న్ని కార్పొరేట్‌కు మార్కెట్‌గా మార్చడానికే వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్‌లు తెచ్చా రన్నారు. కార్మికవర్గం కూడా దీనిపై తిర గబడాలన్నారు. కరోనా సమయంలో ప్రజ లకు సేవలు చేయాల్సిన సమయంలో వ్యాపారానికి మార్గంగా మార్చిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ విధానాలు మార్చుకోవా లని, బీజేపీపైన కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా అందరిని కలుపుకొని బీజే పీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని లేకుంటే కేసీఆర్‌ చెప్పే సమగ్ర అభివృద్ధి సాధించలేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబు, బిక్షమ య్య, యాకయ్య, ముత్యంరావు, రామాచా రి, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, జ్యోతి, గణేష్‌, బత్తిని సంతోష్‌, శైలజ, బిక్షపతి, శంకర్‌, నాగలక్ష్మి, మెండె శ్రీనివాస్‌, పలువురు ప్రజానాట్య మండలి కళాకారు లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement