బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో దేశం తిరోగమనం

ABN , First Publish Date - 2022-08-13T06:01:32+05:30 IST

ఎనిమిదేళ్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లాల్సింది పోయి తిరోగమన దిశకు వెళు తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో దేశం తిరోగమనం
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కొత్త ఫించను మంజూరుకు సైట్‌ ఓపెన్‌ చేయాలి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 12 : ఎనిమిదేళ్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లాల్సింది పోయి తిరోగమన దిశకు వెళు తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భ వన్‌లో శుక్రవారం ఎమ్మెల్సీ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన విధానం చూస్తుంటే జీఎస్టీ పన్నుల విధింపులు, పెట్రోల్‌, డిజీల్‌, వంట గ్యాస్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలను రెట్టింపు చేయడం కనిపిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి రాకముందు దేశంపై అప్పుల భారం రూ. 60 లక్షల కోట్లు ఉం డేదని ఈ ఎనిమిదేళ్ల మోదీ పాలనలో రూ. 130 లక్షల కోట్లకు అప్పుల భారం అధికమై ఏటా దేశ ప్రజలపై రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అప్పుల వాటా రూ. 60 వేల కోట్లు ఉండగా ఈ ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అప్పుల భా రం రూ. 4 లక్షల కోట్లకు చేరిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఎలా ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారో అర్థమౌతుందని, భారత దేశానికి మహనీయులు స్వాతంత్య్రం అందిం చి న ఫలాలు ఇవేనా అని బాధ కలిగిస్తోందన్నారు. వాస్తవ దృక్ఫధంతో, ని ర్మాణాత్మక కార్యాచరణతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకు అందేలా చూడాలన్నారు. నేతన్నలకు చేనేత బీమా కార్యక్రమాన్ని అమ లు చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పధ్మశాలి కుటుంబానికి చేనేత భీమా కార్యక్రమాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాజంలో అత్యంత నిరుపేద లైన ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వారి సంక్షేమానికి కేటాయించకపోవడంతో రూ. 50 వేల కోట్లు క్యారీ ఫా ర్‌వర్డ్‌ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల స మయంలో 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఆసరా ఫించను మంజూరు చేస్తామని లబ్ధిదారుల వద్ద ధరఖాస్తులు స్వీకరించిన ప్రభు త్వం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే సైట్‌ను క్లోజ్‌ చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రానున్న దృష్ట్యా మంత్రి వర్గ సమావే శంలో కొత్త పింఛన్లు జారీకి నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్త పింఛను మంజూరుకు ఎఫిక్‌ కార్డు నిబంధన విధించడం సరికాదని ప్రతి నెలా వ యసు నిర్ధారణ ఆధారంగా ఫించన్ల మంజూరుతో పాటు కొత్త రేషన్‌ కా ర్డులు విధిగా జారీ చేయాలని, నిరంతరం సైట్‌ పనిచేసేలా చర్యలు తీ సుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, ము న్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, నాయకులు రాజేందర్‌, జున్ను రాజేందర్‌, చంద రాధాకిషన్‌ రావు, మహిపాల్‌, లైశెట్టి విజయ్‌. సఫియా ఉన్నారు.


Updated Date - 2022-08-13T06:01:32+05:30 IST