పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తోంది: జల్‌శక్తి శాఖ

ABN , First Publish Date - 2021-08-10T01:40:11+05:30 IST

కేంద్రం తరపున ఏపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతోందని పార్లమెంట్‌కు జల్‌శక్తి

పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తోంది: జల్‌శక్తి శాఖ

ఢిల్లీ: కేంద్రం తరపున ఏపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతోందని పార్లమెంట్‌కు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ  తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తున్నట్లు జల్‌శక్తి శాఖ  పేర్కొంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే బిల్లులను పరిశీలించిన అనంతరం పీపీఏ, కేంద్ర జల సంఘం సిఫారసుతో ఆర్థికశాఖ రీయింబర్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు రీయింబర్స్‌ చేసినట్లు ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.


ఈ ఏడాది ఆగస్టులో రు.418.80 కోట్లు కలిపి ఇప్పటి వరకు రు. 11,600.16 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేసినట్లు ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. రు.256.04 కోట్ల బిల్లులను ఏపీ ప్రభుత్వం పీపీఏకు అందించినట్లు తెలిపిన మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-10T01:40:11+05:30 IST