కరోనా సహాయనిధికి రూ.50 వేలు

ABN , First Publish Date - 2020-03-29T10:17:49+05:30 IST

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన సహాయనిధికి నగరంలోని సుబ్బు పొటో స్టూడియో నిర్వాహ

కరోనా సహాయనిధికి రూ.50 వేలు

దాతలు ముందుకు రావాలి : కలెక్టర్‌ 


కడప(కలెక్టరేట్‌), మార్చి 28: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన సహాయనిధికి నగరంలోని సుబ్బు పొటో స్టూడియో నిర్వాహ కుడు రూ.50 వేల విరాళాన్ని కలెక్టర్‌ హరికిరణ్‌కు అందజేశాడు. కలెక్టర్‌ చాంబరులో కరోనా నివారణకు తనవంతు సాయం అందించిన సుబ్బును కలెక్టర్‌ అభినందించారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనాను తరిమికొట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ సమర్థవంతంగా సాగుతోందన్నారు. దాతలు ముందుకు వచ్చి కరోనా సహాయ నిధికి విరాళాలు అందించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కలెక్టర్‌ను కలసిన వారిలో సుబ్బు సోదరుడు శేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-29T10:17:49+05:30 IST