వస్తే..రా!

ABN , First Publish Date - 2020-06-29T11:37:31+05:30 IST

కరోనా భయపెడుతున్నా జనం మాత్రం భయపడడం లేదు.. ఎవరి దారి వారిదే..కనీస నిబంధనలు పాటించడం లేదు.. భౌతికదూరం మరచి ఎక్కడ పడితే అక్కడ

వస్తే..రా!

కరోనా కోరల్లోకి దూసుకెళ్లిపోతున్న జనం


 ఏలూరు రూరల్‌/ భీమవరంటౌన్‌/  నిడదవోలు/ పాలకొల్లు రూరల్‌, జూన్‌ 28 : కరోనా భయపెడుతున్నా జనం మాత్రం భయపడడం లేదు.. ఎవరి దారి వారిదే..కనీస నిబంధనలు పాటించడం లేదు.. భౌతికదూరం మరచి ఎక్కడ పడితే అక్కడ ఎగబడిపోతున్నారు. స్వీయనియంత్రణ పాటించడం మర్చిపోతున్నారు.ఆ ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో వేగంగా కరోనా కోరల్లోకి దూసుకుపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు మందుకీ..ముక్కకీ దాసోహం అంటున్నారు.. ఎక్కడిబడితే అక్కడ గుంపులు.. గుంపులుగా చేరిపోతున్నారు.


వారమంతా బతుకుజీవుడా అంటూ ఇంటికే పరిమితమైన వారంతా ఆదివారం వచ్చేసరికి మాత్రం అన్నీ మరచి మందు.. ముక్క వేటలో పడుతున్నారు. ఒక పక్క ఏలూరులో 400 మార్కు దాటినా భయం అనేదే కానరావడంలేదు. ఇదిగో ఇలా చేపలకు.. చికెన్‌కు.. మటన్‌గా ఎగబడుతున్నారు. భీమవరంలోనూ ఇదే పరిస్థితి. నేటికి 34 కేసులు నమోదైనా సంతలో పోటీపడుతున్నారు. ఇక నిడదవోలులో అయితే ఇళ్ల స్థలాలకు ఒకరిపై ఒకరు పడిపోయారు.. బాబూ జాగ్రత్త.. ఎవరు దూరం పాటించకపోతే వారికే ప్రమాదం. ఎందుకంటే ఎదుటి వారికి ఉంటే మీకు వచ్చేస్తుంది కరోనా.. అందుకే  ఇకనైనా  దూరం.. దూరం.. భౌతిక దూరం.. 

Updated Date - 2020-06-29T11:37:31+05:30 IST