Abn logo
Oct 2 2020 @ 02:58AM

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి

Kaakateeya

కలెక్టరేట్‌ వద్ద స్వతంత్ర కార్మిక సంఘాల ధర్నా 


 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 1: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ స్వతంత్య్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10 వేలు చెల్లించాలన్నారు. పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నరసింహరావు, జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తాళ్లూరి రాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు రాజబాబు, ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జోజి, అమలాపురం కార్మిక సంఘం నాయకుడు రేలంగి ముకుందం మాట్లాడారు. కార్మిక సంఘాల నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటమణ, మలకా రమణ, నూకాలు, గుబ్బల ఆదినారాయణ, రాగులు రాఘవులు, గణేషుల శ్రీనివాసరాజు, అర్జునరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement