మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:22:47+05:30 IST

జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు.

మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
మెడికల్‌ కళాశాల పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని  కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల, ఎంసీహెచ్‌ ఆసుపత్రి లోని అదనపు పడకల భవన నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్ట ర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రవి మాట్లాడారు. ఫిబ్రవరిలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుల బృందం పర్యటన సం దర్భంగా మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరముందన్నారు. వీలయినంత త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య కళాశాల పనుల పురోగతిపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు జరుగుతున్నా యని, అనుమతి అందిన వెంటనే కళాశాల ప్రారంభించేందుకు అవస రమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జగిత్యాల ఆర్డీఓ మాదురి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌, మెడికల్‌ సూపరెండెంట్‌ సుధక్షణదేవీ, ఆర్‌ఎంఓ రామ కృష్ణ, సీపీఓ పూర్ణచందర్‌, పలువురు అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-01-29T05:22:47+05:30 IST