రాజ్యాంగం రక్షణకు కట్టుబడాలి

ABN , First Publish Date - 2021-11-27T04:27:28+05:30 IST

భారత రాజ్యాంగ పరి రక్షణకు ప్రతీ ఒక్కరు కట్టుబడి అందులోని మూల సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు

రాజ్యాంగం రక్షణకు కట్టుబడాలి
అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న శ్రీసాయి విద్యార్థులు

కలెక్టర్‌ హరిచందన

భారత సంవిధానం పరిరక్షణపై కలెక్టరేట్‌ ఉద్యోగులచే ప్రతిజ్ఞ

నారాయణపేట టౌన్‌, నవంబరు 26 : భారత రాజ్యాంగ పరి రక్షణకు ప్రతీ ఒక్కరు కట్టుబడి అందులోని మూల సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉద్యోగులచే అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్‌లో చైర్‌ పర్సన్‌ వనజమ్మ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళిఅర్పించి రాజ్యాంగ ప్రవేశికను ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సిద్ది రామప్ప, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ మహిళ కన్వీనర్‌ అనిత, అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్‌, మహిళ సంఘర్షణ సమితి జిల్లా కన్వీనర్‌ ఈశ్వరమ్మ, నారాయణ, చంటి, చంద్రయ్య, చంద్రశేఖర్‌, అర్జున్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణ గోకులం పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకు న్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఉమాదేవి, ప్రిన్సిపాల్‌ జేవియర్‌, ఉపాధ్యాయులు పా ల్గొన్నారు. దామరగిద్ద మండల కేంద్రంలో అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వ హించారు. ఎంపీపీ నర్సప్ప మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల ఆశజ్యోతి అంబేడ్కర్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు జోషి, రాజు, రవి, భీమ్‌ పాల్గొన్నారు.

నారాయణపేట : ప్రజలకు, ప్రభు త్వానికి రాజ్యాంగం ఓ కరదీపిక లాంటిదని పాలమూరు యూనివర్సిటీ సహా ఆచార్య డా.భూమయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ప్రిన్సి పాల్‌ మెర్సి వసంత అధ్యక్షతన రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకొని నవంబరు 26కు 72 ఏళ్లు అవుతుందన్నారు. అదే విధంగా శ్రీసాయి స్కూల్‌లోని విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది లక్ష్మణ చారీ, భాస్కర్‌రెడ్డి, సంధ్యారాణి, సత్యభాస్కర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం పేటికను ఆమోదించి 72 సవంత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం దళితమోర్చా పదాదికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లప్ప అశోక్‌ మాట్లాడుతూ ఈనెల 29న నాగర్‌కర్నూల్‌లో జరిగే సమావేశానికి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ముఖ్య అథితిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ్‌కుమార్‌, నాయకులు ఆశప్ప, ఉపాధ్యక్షుడు కిరణ్‌, కృష్ణ, గోవిందు, కార్యదర్శి వెంకట్రాములు, సభ్యులు భాస్కర్‌, హన్మంతు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దన్వాడ : మండల కేంద్రంతో పాటు కిష్టాపూర్‌లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. కిష్టాపూర్‌లో టీ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేయగా ధన్వాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్‌ వ్యవస్థపక అధ్యక్షుడు ఇటుక రాజు, రాష్ట్ర అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు గండి బాల్‌రాజు, ఎలుక బాల్‌రాజు, బీఎస్పీ నాయకులు ఎలిగేండ్ల వెంకటేష్‌, జడల బాల్‌రాజు, కృష్ణయ్య, రమేష్‌, నరేష్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని శుక్రవారం మండలంలోని తీలేరులో అంబేడ్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ రేవతమ్మ, టీఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రామస్థులు కుమ్మరి రాజు, భీమ్‌రాజ్‌, దేవదాస్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

నర్వ : దళిత సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్పవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ సంధ్య, వైస్‌ ఎంపీపీ వీణావతి పూలమాల వేసి నివాళళ అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గుడిసె వెంకటయ్య, దళిత సంఘం నాయ కులు శరణప్ప, పెద్దింటి ఆంజనేయులు, డీలర్‌ వెంకటయ్య, బాల్‌దాస్‌, వెంకటన్న, వెంకటేష్‌, బొజ్జన్న పాల్గొన్నారు

మాగనూరు : మండల కేంద్రంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో, కేజీబీవీలో, ఎస్సీ బాలుర వసతి గృహాంలో తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కోస్గి : భారత రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకొని శుక్రవారం కోస్గిలో బీఎస్పీ కొడంగల్‌ ఇన్‌చార్జి ఇస్వప్ప, తాలూకా అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రధానకార్యదర్శి కృష్ణమౌర్య ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాల వేశారు. అనంత రం ఆయన సేవలను కొనియాడారు.

ఊట్కూర్‌  : భారత రాజ్యాంగం ఆవిర్భవించి 72 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో గల అంబేడ్కర్‌ విగ్రహానికి దళిత శక్తి పోగ్రాం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఎస్పీ మండల కోఆర్టీనేటర్‌ అశోక్‌కుమార్‌ రాజ్యంగ నిర్మాణంలో అంబేడ్కర్‌  కృషిని వివరించారు.  చిన్నపొర్ల ఉన్నత పాఠశాల,  నిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో  విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. నిడుగుర్తి పాఠశాలలో విద్యార్థులు సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంలు జగన్నాథ్‌రావు, లక్ష్మారెడ్డి, బీఎస్పీ నాయకులు దశరథ్‌, మహారాజ్‌, రాజ్‌కుమార్‌ మహారాజ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని చిట్యాల, మంథన్‌గోడ్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సర్పంచు జానికి, హెచ్‌ఎంలు పురుషోత్తం, విభీషన్‌, ఎంపీటీసీ రాంలింగం, ఎస్‌ఎంసి చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మద్దూర్‌ : మండలంలోని మద్దూ రు, భూనీడ్‌, కొత్తపల్లి గ్రామాల్లో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. యువజన సంఘం సభ్యులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో భూనీడ్‌ సర్పంచ్‌ వెంకటేశ్‌, స్వేరో, అంబేడ్కర్‌ జిల్లా, మండల అధ్యక్షులు కృష్ణ,డేవిడ్‌, దాసు, యువజన సంఘం సభ్యులు రాజు, రాములు, బాలరాజు, విజయ్‌, వెంకట్‌, గణేష్‌,  వెంకటప్ప, చిన్నయ్య పాల్గొన్నారు




Updated Date - 2021-11-27T04:27:28+05:30 IST