నవభారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకం

ABN , First Publish Date - 2021-11-27T04:40:31+05:30 IST

నవభా రత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పో షించిందని అనంతపురం జేఎన్టీయూ వైస్‌చా న్సెలర్‌, ప్రొఫెసర్‌ రంగజనార్దన్‌ పేర్కొన్నారు.

నవభారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకం
కార్యక్రమంలో మాట్లాడుతున్న వీసీ రంగజనార్దన్‌

పులివెందుల రూరల్‌, నవంబరు 26: నవభా రత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పో షించిందని అనంతపురం జేఎన్టీయూ వైస్‌చా న్సెలర్‌, ప్రొఫెసర్‌ రంగజనార్దన్‌ పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల జేఎన్టీయూ కళాశా లలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాజ్యాంగం ఔన్నత్వాన్ని వివరించారు. అనం తరం ప్రతిజ్ఞ చేయించారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌, పులివెందుల జేఎన్టీయూ ప్రిన్సి పాల్‌ జీఎస్‌ఎస్‌ రాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ సు బ్బారెడ్డి, విభాగాధిపతులు పాల్గొన్నారు. 

బాలికల కళాశాలలో....

రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో పయనిద్దామని ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌ వెంక టసుబ్బయ్య, స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు పిలుపు నిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించు కుని కళాశాలలో అంబేడ్కర్‌  చిత్రపటానికి నివాళులర్పించారు. 

ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో....

బద్వేలు, నవంబరు 26: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే కమల మ్మ పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం సందరంగా డాక ్టర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు ప్రభాకర్‌, జయకుమార్‌ పాల్గొన్నారు. 

బి.కోడూరులో.... 

బి.కోడూరు, నవంబరు 26: గోవిందాయపల్లె జడ్పీ హైస్కూల్‌, సగిలేరు గురుకుల పాఠశా లలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాపయ్య చెన్న య్య, తిరుపతయ్య, సురేష్‌, వెంకటసుబ్బ య్య, జాతీయ అవార్డు గ్రహీత కృష్ణానాయ క్‌, తదితరులు పాల్గొన్నారు. 

దువ్వూరులో....

దువ్వూరు, నవంబరు 26: రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రజాసంఘాల నేతలు నివాళులు అర్పించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఎంపీడీఓ కార్యాలయంలో జైభీం సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు జయరాం, మహాజన అభ్యుదయ సమైఖ్య సొసైటీ ఛైర్మన్‌ మాచయ్య, దళిత నేతలు అంబేడ్కర్‌ విశిష్ఠతను కొనియాడారు. కస్తూర్భాగాంధీ గురుకుల పాఠశాలలో ప్రత్యేక అధికారి నాగలక్ష్మి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు అంబేడ్కర్‌ సేవలను వివరించారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో....

వేంపల్లె, నవంబరు 26: ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కు లను తెలుసుకోవాలని ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపీర్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం, ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవా లు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రహంతు ల్లా, వేముల మండల సభ్యులు రఫి, ఫయాజ్‌, మౌలాలి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సేవా సమితి అధ్యక్షుడు రామాంజనేయులు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:40:31+05:30 IST