కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2020-07-12T10:14:10+05:30 IST

కార్మికుల హక్కుల కోసం ఎంప్లాయీస్‌ యూనియన్‌ నిరంతరం సాగిస్తూనే ఉంటుందని ఆర్టీసీ వర్క్‌షాపు రీజనల్‌ నాయకుడు

కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు


కడప (మారుతీనగర్‌), జూలై 11 :కార్మికుల హక్కుల కోసం ఎంప్లాయీస్‌ యూనియన్‌ నిరంతరం సాగిస్తూనే ఉంటుందని ఆర్టీసీ వర్క్‌షాపు రీజనల్‌ నాయకుడు అంకిరెడ్డి అన్నారు. యూనియన్‌ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్క్‌షాపులో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల జీతభత్యాలు, హక్కులు సాధన కోసం నిరంతరం ప్రభుత్వాలతో పోరాటం సాగిస్తున్నామన్నారు. ఆర్టీసీలో మొట్టమొదటిసారి ఫిట్‌మెంట్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా 9.5 శాతం ఫిట్‌మెంట్‌ సాధించామని తెలిపారు. 2013లో కూడా గుర్తింపులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంటు సాధించామన్నారు. కార్యక్రమంలో సాదక్‌వల్లి, కొండూరు జయసింహరాజుతో పాటు పలువురు వర్క్‌షాపు కార్మికులు పాల్గొన్నారు.


ఈయూను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ను విమర్శించే నైతిక హక్కు ఆర్టీసీలోని మరే ఇతర కార్మిక సంఘాలకు లేదని ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు కేకేకుమార్‌ తెలిపారు. యూనియన్‌ 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని యూనియన్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి రామాయణం నారాయణ, రీజనల్‌ నాయకులు ఏఆర్‌ మూర్తి, వెంకటేశ్‌, శ్రీనివాసులు, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T10:14:10+05:30 IST