Abn logo
Oct 26 2021 @ 23:25PM

బీసీలపై పాలకుల కుట్ర

బీసీ కుల సంఘాల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న బాలవర్దన్‌గౌడ్‌

- బీసీ చైతన్య యాత్ర నియోజకవర్గ అధ్యక్షుడు బాలవర్దన్‌ గౌడ్‌ 


బాలానగర్‌, అక్టోబరు 26 : బీసీలపై దేశవ్యాప్తంగా కనిపించని విధంగా కుట్ర జరుగు తోందని, బీసీలు అప్రమత్తం గా ఉండి ఎదుర్కోవాలని బీసీ చైతన్య యాత్ర  నియోజకవర్గ అధ్యక్షుడు ఎడ్ల బాలవర్దన్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని అమ్మపల్లి, గౌతాపూర్‌, పెద్దరేవల్లి, చిన్నరేవల్లి, మొదంపల్లి తదితర గ్రామాలలో బీసీ చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీలకు జరుగు తున్న అన్యాయాల గురించి విరించారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.