కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవాలి

ABN , First Publish Date - 2021-10-25T06:18:11+05:30 IST

అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవాలి
శివపల్లిలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

- ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి 

- తెలంగాణను కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి విడిపించాలి

- హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదు 

- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఎలిగేడు, అక్టోబరు 24: అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎలిగేడు మం డలంలోని శివపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సాగునీరు అడిగినందుకు జైల్లో పెట్టారని చెప్పారు. కాంట్రాక్టులకు ఆశపడి పెద్ద పల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఈప్రాంత ప్రజలు చెబుతున్నారని అన్నారు. నిరుపేద విద్యా ర్థులను ముక్కు పిండి ఫీజులు వసూలుచేసిన ఘనత, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఎంఐఎం పెద్దపల్లి జిల్లా మాజీ అద్యక్షు డు సయ్యద్‌ మస్రత్‌, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సాయిర మహేందర్‌, ఎలిగేడు మండల రైతు సమన్వయ సమితి అధ్య క్షుడు గోదల శ్రీనివాస్‌రెడ్డి పాటు పలువురు నాయకులను రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే అసెంబీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి విజయరమణారావును భారీ మెజారిటీతో గెలిపించాల ని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, రాజయ్య, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సత్యనారాయణ, విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్‌కు ఘన స్వాగతం 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మొదటిసారి ఎలిగేడు మండలానికి రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాట్నపల్లి నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బైకు ర్యాలీతో ఆయను శివపల్లి గ్రామం వరకు తోడుకునివచ్చారు. కాగా, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు 800 మంది పైచిలుకు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సమ క్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Updated Date - 2021-10-25T06:18:11+05:30 IST