ముగిసిన కాంగ్రెస్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-15T06:29:42+05:30 IST

స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 11వతేదిన జిల్లాకాంగ్రె్‌సపార్టీ ఆధ్వర్యంలో పలమనేరులో పాదయాత్ర ప్రారంభించారు.

ముగిసిన కాంగ్రెస్‌ పాదయాత్ర
జీడీ నెల్లూరులో ప్రసంగిస్తున్న తులసిరెడ్డి

గంగాధరనెల్లూరు, ఆగస్టు 14: స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 11వతేదిన జిల్లాకాంగ్రె్‌సపార్టీ ఆధ్వర్యంలో పలమనేరులో పాదయాత్ర ప్రారంభించారు. బంగారుపాళ్యం, చిత్తూరు మీదుగా గంగాధరనెల్లూరు వరకు 80 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పీసీసీ వర్కింగ్‌కమిటీ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణలేని కారణంగా అప్పుల ఆంధ్రగా మారిందని ఆరోపించారు. 58 ఏళ్ళలో నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు 16 మంది సీఎంల కాలంలో రూ.లక్షకోట్లు అప్పు చేయగా.. విభజన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మరో రూ.రెండు లక్షల కోట్ల అప్పుచేయడంతో రూ.3లక్షలకోట్లకు చేరిందన్నారు. ఈ మూడేళ్లలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.5లక్షలకోట్లు అప్పుచేయడంతో రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. అప్పుల డేంజర్‌ ఎప్పుడు పేలుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురైతేనే దిక్కులేదని, చిన్నాన్న కూతురు సునీతరెడ్డి కడప ఎస్సీకి ఆమెతో పాటు వారికుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరుకోవడం చూస్తే వైసీపీపాలన ఏవిధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతుందన్నారు. వైసీపీని దిగంబర పార్టీ అనాలా, రాసలీల పార్టీ అనాలా, కామాంధుల పార్టీ అనాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. గోరంట్ల మాధవ్‌ ట్రాక్‌రికార్డు పూర్తిగా నేరపూరితమని అలాంటి వ్యక్తిని హిందుపురం ఎంపీగా టికెట్‌ ఏవిధంగా ఇచ్చారనే, ఎంపీగా గెలిచినతర్వాత కూడా అతని వ్యవహారం మారకపోగా, అతని వీడియోలు హల్‌చల్‌చేస్తుంటే  సీఎం జగన్‌రెడ్డి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ నరసింహులు, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నేతలు పూర్ణచంద్రశేఖర్‌, పార్థసారధి, లాయర్‌ మణిక్రిష్ణ, గోవర్ధన్‌రెడ్డి, పరదేశి, సుబ్బరాయులు, ఇనయతుల్లా, భాస్కర్‌రెడ్డి, విక్టోరియా, రాణియాదవ్‌, కన్నన్‌, పుష్పరాజ్‌, చిరంజీవిరెడ్డి, నారాయణ, భాగ్యరాజ్‌, రంగప్పగౌడ, మురుగన్‌, గోవిందరాజులు, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T06:29:42+05:30 IST