మునుగోడుపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

చరిత్రహీనుడైన రాజగోపాల్‌రెడ్డి నమ్మిన నాయకత్వాన్ని నయవంచనచేసి అమిత్‌షా పక్కన చేరాడు.. రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టి వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చండూరులో శుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

మునుగోడుపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి
సభలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి , సభకు హాజరైన కాంగ్రెస్‌ నాయకులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, భట్టి విక్రమార్క తదితరులు

అభివృద్ధికే అయితే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలి

కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల ప్యాకేజీ తెచ్చి నామినేషన్‌ వెయ్‌

90వేల ఓటర ్ల ఆత ్మగౌరవాన్ని రాజగోపాల్‌రెడ్డి తాకట్టుపెట్టాడు

చండూరు సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి


చరిత్రహీనుడైన రాజగోపాల్‌రెడ్డి నమ్మిన నాయకత్వాన్ని నయవంచనచేసి అమిత్‌షా పక్కన చేరాడు.. రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టి వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చండూరులో శుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.


నల్లగొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఈడీ వేధిస్తోందని కాంగ్రెస్‌ కార్యకర్తలు దేశం మొత్తం క దం తొక్కుతుంటే కలిసిరాని రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా పక్కన చేరి 21వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడు పోయాడని చండూరు సభలో రేవంత్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన 90వేల ఓటర్ల ఆత్మగౌరవాన్ని కుదువ పెట్టాడని అన్నారు. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారవుతాయనుకుంటే ఇక్కడ కమ్యూనిస్టు జెండా ఎగిరి ఉండేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధిలో జానారెడ్డి, మాధవరెడ్డి, ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి పాలుపంచుకున్నా రన్నారు. నిజాం నవాబును ఎదిరించి రజాకార్ల ముఠాలను తరిమికొటి,్ట మరఫిరంగుల గుండ్లు కురిపించినా నాడు చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డారన్నారు. ధర్మభిక్షం, మల్లు స్వరా జ్యం, చకిలం శ్రీనివాసరావు, బీఎన్‌.రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి వంటి వారు ప్రాతినిధ ్యం వహించిన నేల ఇది అన్నారు. ఈ ప్రాంతంలో ఎగిరితే కాంగ్రెస్‌ జెండా, లేదంటే ఎర్ర జెండా ఎగిరిందన్నారు. అధికారమే పరమావధి కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడి పాలకులపై పోరాడిన చరిత్ర మునుగోడు నియోజకవర్గానికి ఉందన్నారు.  2018 ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికె ట్టు రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఆ ఆడబిడ్డ ఇంటింటికీ తిరిగి ఆయన్ను గెలిపించలేదా అని ప్రశ్నించారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డికి 50ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, రాజకీయాల కోసం వందల ఎకరాలు, ఆ కుటుంబం కాంగ్రెస్‌ జెండా నీడనే ఉందన్నారు.


కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం 

రాజగోపాల్‌ రాజీనామా వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నాయకులు రెండు రోజుల వ్యవధిలో సభ నిర్వహించగా, కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మునుగోడులో కాంగ్రె్‌సకు బలమైన క్యాడర్‌ ఉండగా, అదే విశ్వాసంతో పీసీసీ అధ్యక్షుడు సభకు పిలుపునివ్వగా అంచనాకు మించి జనం, పార్టీ శ్రేణులు చండూరుకు తరలివచ్చారు. వర్షం కురుస్తున్నా, పొలం పనుల్లో బిజీగా ఉన్నా సాయంత్రం 4గంటలకే సభాస్థలి నిండింది. సభ విజయవంతం కాకుండా రాజగోపాల్‌రెడ్డి అనుచరులు గురువారం రాత్రి నుంచే విందులు ఏర్పాటు చేసి గ్రామాల నుంచి సభకు జనం వెళ్లకుండా చూడాలని చేసిన సూచనలు ఫలించలేదు. రేవంత్‌ క్షమాపణలు చెప్పాలని రాజగోపాల్‌ వర్గీయు లు సభకు అంతరాయం కలిగిస్తారనే ప్రచారం సాగినా ఎక్కడా అడ్డుపడలేదు. ఆ అంచనాతోనే పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. రాత్రి 8గంటలకు రేవంత్‌ ప్రసంగం ప్రారంభం కాగా జోరున వర్షం కురిసినా, జనం కదలకుండా విన్నారు. సభలో కాంగ్రెస్‌ నాయకులు 15మంది ప్రసంగించినా ప్రజలు మైదానాన్ని వీడకుండా ఆసక్తిగా విన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ సభ విజయవంతం కావడంతో పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.


అమిత్‌షా పెట్టే గడ్డికోసమే రాజగోపాల్‌ వెళ్లాడు

జైలుకి పోయినోడి కింద పనిచేయలేకపోతున్నానని రెండు రోజుల నుంచి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడని, కేసీఆర్‌, ఆయన కుటుం బ పాలనపై పోరాటం సాగించడం వల్లే తనపై 120 కేసులు పెట్టారన్నారు. తాను 30రోజులు జైలులో ఉంటే, గుజరాత్‌లో హత్యలకు పాల్పడిన అమిత్‌షా 90రోజులు జైలులో ఉన్నారన్నారు. అమిత్‌షా పెట్టే గడ్డితినేందుకే ఆయన పక్కన చేరాడని విమర్శించారు. ఆ గడ్డి తియ్యగుం దా? కేసీఆర్‌పై పోరాటం చేసే నా పక్కన ఉంటే ఏం నొచ్చింది? నాయకులు నచ్చకపోతే మునుగోడు ఓటర్లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్కను సైతం తిట్టాడని, తనను కూడా చాలా మార్లు తిట్టినా తిక్కలోడు ఉదయం ఒకతీరు, రాత్రికి ఒకతీరు మాట్లాడతాడని ఊరుకున్నానని, కుక్కతోక ఎంతో రాజగోపాల్‌రెడ్డి కూడా అంతేనన్నారు. మునుగోడు నియోకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి ముసుగు తొడిగాడని ఆరోపించా రు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి ఉంటుందని భావించి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తానంటే టికెట్టు ఇచ్చే వాడిని కదా అన్నారు. కాంట్రాక్టుల కోసమే అమ్ముడుపోయాడన్నారు.


ఉప ఎన్నికతో ఏం అభివృద్ధి జరిగింది

అభివృద్ధిపై ప్రేమ ఉంటే కేంద్రంలో మోదీ, అమిత్‌షాను అడిగి ఎస్‌ఎల్‌బీసీ సొరం గం, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుతోపాటు మిగిలిన పనుల కు రూ.5వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి ఉప ఎన్నికలో నామినేషన్‌ వేయాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని, నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే అక్కడ ఏం అభివృద్ధి జరిగిందని, ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. రేపు మునుగోడు లో అంతకుమించి ఏం జరగదన్నా రు. కార్యకర్తలను మోసంచేసి బీజేపీలోకి వెళ్తున్న రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. తాను హైదరాబాద్‌ నుంచి వస్తుంటే టమాటాలు, గుడ్లు వేయాలని రాజగోపాల్‌రెడ్డి కొందరికి డబ్బులిచ్చాడని ఆరోపించారు. తనపై గుడ్లు, టమాటాలు వేస్తే రాజగోపాల్‌ ఇంటిపై పెండ పడుతుందని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి దర్వాజాలు, కిటీకీలు ఊడపీకుతారన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపునకు ఊరూరా తిరుగుతా, ప్రతీ యువకుడిని కలుస్తానన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరాయిస్తే ప్రజాసేవకు ఇక ఎవడూ ముందుకు రాడని, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు అభిమానులు ఆలోచించాలన్నారు.

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST