వైసీపీ పాలనలో నేతన్నల పరిస్థితి దుర్భరం

ABN , First Publish Date - 2022-08-08T05:37:37+05:30 IST

వైసీపీ పాలనలో చేనేతల పరిస్థితి దుర్భరంగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో నేతన్నల పరిస్థితి దుర్భరం
నేతన్న విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న పరిటాలశ్రీరామ్‌

నేతన్న విగ్రహానికి పూలమాల వేసిన పరిటాలశ్రీరామ్‌

ధర్మవరం, ఆగస్టు 7: వైసీపీ పాలనలో చేనేతల పరిస్థితి దుర్భరంగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కదిరిగేటు వద్దగల నేతన్న విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ మాట్లా డుతూ...ప్రపంచంలోనే అతిపురాతనమైన వృత్తిగా చేనేత గుర్తింపు పొందిందన్నారు. అలాంటి పరిశ్రమపై నేడు అన్ని వర్గాలకు చెందిన వేలకుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. అలాంటి పరిశ్రమ నేటి పాలకుల తీరుతో నిర్వీర్యమైందన్నారు. గత టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు సబ్సిడీతో పథకాలను అందించామన్నారు. రైతులకు పట్టుగూళ్ల పెంచుకోవడానికి షెడ్‌ తదితర ప్రోత్సా హకాలు ఇచ్చామ న్నారు. వైసీపీ వచ్చిన తరువాత పథకాలన్నీ నిలిపివేసి కేవలం నేతన్న నేస్తం మాత్రమే ఇస్తున్నారన్నారని విమర్శించారు. అది కూడా ఏడాది కొకసారి వివిధ నిబంధనలతో  లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నార న్నారు. ముడిపట్టు సరుకుల ధరలు వందశాతం పెరిగాయన్నారు. దీంతో పాటు నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి కోసం చేసిన అప్పు లు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గడచిన మూడేళలో 50మందికి పైగా చేనేతలు ఆత్మహత్య లకు పాల్పడ్డారన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పురుషోత్తంగౌడ్‌, పరిశే సుధాకర్‌, చింతపులుసు పెద్దన్న, మేకల రామాంజనేయులు, భీమనేని ప్రసాద్‌నాయుడు, సాహెబ్బీ, బీబీ, రాంపురం శీన, చిన్నూరు విజయ్‌చౌదరి, గంగారపు రవి, అంబటి సనత, నాగూర్‌ హుస్సేన,  రాళ్లపల్లి షరీఫ్‌, బొట్టు కిష్ట, గోసల శ్రీరాములు, పూలకుంట్ల మహేశ, సంగాల బాలు, యుగంధర్‌, వాల్మీకి అశోక్‌, గొట్లూరు అనిల్‌గౌడ్‌, గరుడంపల్లి అంజి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:37:37+05:30 IST