తలపై ఉన్నది విగ్గో.. టోపియో కాదు

ABN , First Publish Date - 2021-11-26T09:40:28+05:30 IST

ఈ యువకుడి తలపై ఉన్నది విగ్గో.. టోపియో కాదు.. ప్యాషన్‌ కోసం వేసుకున్న రంగు అంతకన్నా కాదు. మొలకెత్తిన వరి ధాన్యం ఇది

తలపై ఉన్నది విగ్గో.. టోపియో కాదు

యువకుడి తలపై ఉన్నది విగ్గో.. టోపియో కాదు.. ప్యాషన్‌ కోసం వేసుకున్న రంగు అంతకన్నా కాదు. మొలకెత్తిన వరి ధాన్యం ఇది. ఇలా టోపీలా మలుచుకుని సెల్ఫీ దిగాడు. పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఓ యువకుడు ఇలా దర్శనమిచ్చాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల దుస్థితికి ఈ దృశ్యం అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-11-26T09:40:28+05:30 IST