Advertisement
Advertisement
Abn logo
Advertisement

కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలి

మార్కాపురం, డిసెంబరు 2 : తమకు పాఠాలు బోధించిన అధ్యాపకులను తిరిగి తమ కళాశాలలో నియమించి, ఎస్వీకేపీ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగా కొన సాగించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని  ఎస్వీకేపీ కళాశాల విద్యార్థులు సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫార్‌కు వినతిపత్రం అంద జేశారు. త్వరలో సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయని, తమకు పర్మినెంట్‌ అధ్యాపకులతో పాఠాలు బోఽ దించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు సౌమ్య, పావని, భాజీ, ప్రమోద్‌, అంజి, హరి, శివకృష్ణ, అజయ్‌, చంద్రశేఖర్‌, ఏసయ్య పాల్గొన్నారు. 


Advertisement
Advertisement