నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ నిఖిల
బొంరాస్‌పేట్, జనవరి 25: చౌదర్‌పల్లి గ్రామంలో నర్సరీని జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. మంగళవారం బొంరాస్‌పేట్ మండలంలో పర్యటించిన కలెక్టర్ నిఖిల చౌదర్‌పల్లిలో నర్సరీని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీలో మొక్కల పెంపకంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. జూన్, జూలై నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.