Abn logo
Jun 22 2021 @ 01:31AM

గంధమల్ల రిజర్వాయర్‌పై సీఎం స్పష్టత ఇవ్వాలి

కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి అయిలయ్య

తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించిన సీపీఐ నాయకులు

యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి)/యాదాద్రి రూరల్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం చేపడతారా, లేదా అనే అంశంపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడుతూ తుర్కపల్లి మండలం గంధమల్లలో తొమ్మిది టీఎంసీలుగా మొదట ప్రకటించి తర్వాత సామర్థ్యం కుదించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. దీంతో  ముంపు ప్రభావిత గ్రామాల్లో నిర్వాసితులు తమ పిల్లల పెళ్లిళ్లకు సైతం భూములు అమ్ముకోలేక, ప్రభుత్వ పరిహారం అందక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్డాతున్నారన్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ మంగళవారం పర్యటిస్తున్న నేపథ్య ంలో ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో  సాగునీటికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. యాదగిరిగుట్టలో రహదారుల విస్తరణకు సమన్యా యం పాటించాలని, న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు. సమావేశ ంలో మునిసిపల్‌ కౌన్సిలర్‌ ముక్కెర్ల మల్లేశం, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, జిల్లా నాయకులు సుడుగు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


గంధమల్ల రిజర్వాయర్‌తో సాగు, తాగు నీరందించాలి 

యాదాద్రి రూరల్‌ : గందమల్ల రిజర్వాయర్‌ త్వరగా పూర్తిచేసి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి సాగు, తాగు నీరందించాలని సీపీఐ నాయకులు సోమవారం డీటీ నర్సింహారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్‌ మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి  ఎదురుచూస్తున్న రిజర్వాయర్‌ ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాంత వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా గంధమల్లపై సీఎం వైఖరిని ప్రకటించాలని కోరారు. ఆయన వెంట కొత్తగుండ్లపల్లి సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి పేరబోయిన బంగారి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 


వెంటనే పనులు చేపట్టాలి 

ఆలేరు/రాజాపేట /మోటకొండూరు : నియోజకవర్గానికి సాగు నీరందించే గంధమల్ల రిజర్వాయర్‌ పనులు తక్షణమే చేపట్టాలని సీపీఐ నాయకులు ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాలకు సాగు నీరందించాలంటే గంధమల్ల రిజర్వాయరే శరణ్యమన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం 35ఏళ్లుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్నారు. ఎమ్మెల్యే సునీత ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీటీ వెంక టేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు చెక్క వెంకటేష్‌, తేరపు రాములు చౌడబోయిన కనకయ్య, శ్రీనివాస్‌, అంజనేయు లు పాల్గొన్నారు. అదేవిధంగా సీపీఐ నాయకులు రాజాపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ జయమ్మకు వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో సీపీ ఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరు రాజయ్య, మండల కార్యదర్శి చి గుర్ల లింగం, మల్లేశం, సత్తయ్య, రాములు, బాలయ్య ఉన్నారు. గంధమల ్లను రిజర్వాయర్‌ చేసి మోటకొండూరు మండలానికి సాగు, తాగు నీరు అందించాలని సీపీఐ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.