దళితుల ఆర్థికవృద్ధే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T06:16:40+05:30 IST

దళితుల ఆర్థికవృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మం త్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

దళితుల ఆర్థికవృద్ధే సీఎం లక్ష్యం
ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటరూరల్‌, మే 20: దళితుల ఆర్థికవృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మం త్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సూ ర్యాపేట మండలం రామన్నగూడెం, బాలెంల, భాషానాయక్‌తండాలో దళితబంధు పథకం యూనిట్లను శుక్రవా రం ప్రారంభించి మాట్లాడారు. దళితులకు సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారన్నారు. దళితబంధు దేశంలోనే గొప్ప పథకమన్నారు. దళితబంధు యూనిట్లను అందుకున్న లబ్ధిదారులు ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆర్థిక వనరులు పెంచుకొని జీవితంలో శాశ్వతంగా స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వంగాల శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 


దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే 

ఆత్మకూర్‌(ఎ్‌స):అరవై ఏళ్లుగా దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టిన అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, కొత్తగూడెం శివారులోని కాకి తండాలో వివిధ పార్టీలకు చెందిన నా యకులు టీఆర్‌ఎ్‌సలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌,ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, పాల్గొన్నారు. 


మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

సూర్యాపేట(కలెక్టరేట్‌): మహిళా సంక్షేమానికి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లబ్ధిదారులు 74మందికి  చెక్కులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:16:40+05:30 IST