మూసీ నది ప్రక్షాళన వెంటనే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-28T06:00:44+05:30 IST

కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని వెంటనే ప్రక్షాళన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ నదిపై ట్రిట్‌మెంట్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసి నీటిని శుద్ధిచేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు.

మూసీ నది ప్రక్షాళన వెంటనే చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు

వలిగొండ, మే 27: కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని వెంటనే ప్రక్షాళన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ నదిపై ట్రిట్‌మెంట్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసి నీటిని శుద్ధిచేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. మూసీ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను వినియోగిస్తున్న ఈ ప్రాంత ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిపై స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి పట్టింపే లేదని విమర్శించారు. కాలుష్యంపై 104 దేశాల్లోని 258 నదులపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ప్రమాదకర నదుల్లో మూసీ నది 22వ స్థానంలో నిలిచిందని అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ ఆఽధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సమస్యలను సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేసి దేశంలో కూటమికట్టేందుకు యత్నిస్తుండటం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగ్‌రావు, నకిరెకంటి మొగులయ్య, రాఘవులు నరేందర్‌, మండల అధ్యక్షుడు నాగవెల్లి సుధాకర్‌గౌడ్‌, నాయకులు రాచకొండ కృష్ణ, పుల్లయ్య, శ్రీనివాస్‌, వెంకటేశం, అమరేందర్‌, మహేష్‌, మల్లేష్‌, పాండు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:00:44+05:30 IST