పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2022-01-29T06:05:09+05:30 IST

పరిసరాల శుభ్రతకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ షా కోరారు. జీవీఎంసీ 87వ వార్డులోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. కాలనీలలో రహదారులు, డ్రైనేజీలు, పార్కులను ఆయన పరిశీలించారు

పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ షా, ఇతర ప్రతినిధులు

జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ షా

కూర్మన్నపాలెం, జనవరి 28:  పరిసరాల శుభ్రతకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ షా కోరారు. జీవీఎంసీ 87వ వార్డులోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. కాలనీలలో రహదారులు, డ్రైనేజీలు, పార్కులను ఆయన పరిశీలించారు. అనంతరం తిరుమలనగర్‌ను సందర్శించారు. కాలుష్య నివారణకు అక్కడ మొక్కలను నాటారు. 14 పర్యాయాలు స్వచ్ఛ అవార్డులను గెలుపొందిన తిరుమల నగర్‌ కాలనీ అసోసియేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించి, వారిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గుడ్డ, కాగితం, నార సంచులను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త-పొడి చెత్త వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. వార్డు  కార్పొరేటర్‌ బొండా జగన్‌ పలు ప్రజా సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకునివచ్చారు. ఈ పర్యటనలో జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, ప్రగడ వేణుబాబు, బెల్లంకొండ రాజన్‌రాజు, ఎస్‌ఎస్‌ విజయరామరాజు, కళ్లేపల్లి శ్రీనివాస వర్మ, బొడ్డ గోవింద్‌, దుగ్గపు దానప్పలు, కోమటి శ్రీనువాసరావు, రమాదేవి, చిత్రాడ వెంకట రమణ, వర్రె రాంబాబు, డీవీ అప్పారావు, కర్రి కన్నారావు, భాస్కరరావు, సూరిబాబు, నాగభూషణం, విశ్వేశ్వరరావు, పరమానందం, పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-01-29T06:05:09+05:30 IST