Abn logo
Sep 26 2021 @ 00:30AM

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ

అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ


భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 25: పర్యాటక ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి పాటించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ ఆదేశించారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా శనివారం భువనగిరి ఖిల్లాపై నిర్వహించిన స్వచ్ఛత పక్వాడలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యత మాదిరిగానే బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతకు కూడా అంతే ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. పర్యాటకుల సం ఖ్య పెరిగితే ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. స్థానిక కళాశాలలు ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స కేడెట్లతో కలిసి ఆయన ఖిల్లాపై పేరుకపోయిన వ్యర్థాలను తరలించి, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.ధనుంజయనేయులు, ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి శ్రీదేవి, బాలాజీ, సరగడ పాల్గొన్నారు.