నీటితొట్లు నిరుపయోగం

ABN , First Publish Date - 2022-05-22T06:52:20+05:30 IST

మూగజీవాలకు దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం గ్రామపరిసరాలలో నీటితొట్లను నిర్మించింది. ఒక్కొక్క నీటితొట్టికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద రూ. 20వేలు ఖర్చు చేసింది.

నీటితొట్లు నిరుపయోగం
నిరుపయోగంగా ఉన్న నీటి తొటే

కంభం, మే 21 : మూగజీవాలకు దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం గ్రామపరిసరాలలో నీటితొట్లను నిర్మించింది. ఒక్కొక్క నీటితొట్టికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద రూ. 20వేలు ఖర్చు చేసింది. మండలంలోని 14 గ్రామపంచాయతీలలో దాదాపు 30కి పైగా నీటి తొట్లు నిర్మించారు. 

మండలంలో దాదాపు మేకలు 15611, గొర్రెలు 47183, గేదెలు 15633, ఎద్దులు 3791 ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్రామాల వెంబడి ఉండే నీటి తొట్లు పశుపోషకులకు ఉపయోగంగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరడంతో మూగజీవాలకు నీరందించలేని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు తొట్లలో నీరు నింపాల్సి ఉన్నా, ఆ తొట్లకు నీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని పశువుల కాపరులు వాపోతున్నారు. దీంతో పలుచోట్ల  తొట్లు నిరుపయోగంగా మారాయి. 

మూగజీవాలకు అందని తాగునీరు

మండలంలోని 14 పంచాయతీలలో 30కి పైగా నీటితొట్లు నిర్మించారు. వాటికి నీటి సదుపాయం కల్పించే బాధ్యత గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులపై ఉంది. సమీపంలోని బోర్లు, వ్యవసాయ బావుల నుంచి పైపులైన్ల ద్వారా నీటితొట్లను నింపాల్సి ఉంది. తొట్లకు నీటిసదుపాయం లేకపోవడంతో మూగజీవాలకు తాగునీరు అందడం లేదు.

ప్రజాధనం వృథా

ఒక్కొక్క నీటి తొట్టిని ప్రభుత్వం రూ. 20వేలు వెచ్చించింది. గ్రామపరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఆ తొట్లలో నీరు లేకపోవడంతో ప్రజాధన వెచ్చించి నిర్మించిన తొట్లు నిరుపయోగంగా మారాయి.

Updated Date - 2022-05-22T06:52:20+05:30 IST