తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-06-04T09:25:14+05:30 IST

నైతిక విలువలు ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయా లని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ ..

తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

పిటిషన్‌ తిరస్కరణ ప్రభుత్వానికి చెంపపెట్టు: కూన రవికుమార్‌


ఆమదాలవలస, జూన్‌ 3: నైతిక విలువలు ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయా లని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులకు సంబంధించిన పిటిషన్‌ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడం ప్రభుత్వానికి చెంపపెట్టని తెలిపారు. బుధవారం ఆమదాలవలసలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై సరికాదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించకుండా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ కూడా కొట్టివేసిందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌, న్యాయ స్థానాలు రాజ్యాంగ బద్ధమైన సంస్థలని చూడకుం డా మంత్రులు, ఎమ్మెల్యేలు కు లం, మత ఆపాదించడం  కించపరిచేలా  సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేయడం దురదృష్టకర మని తెలిపారు. రూ.4,500 కోట్లతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తక్షణమే ఆ సొమ్ము ఖజానాకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.


కరోనా నేప థ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించారన్నారు. ఆర్డినెన్స్‌ చెల్లదని హైకోర్టు తీర్పును తప్పుపడుతూ   సుప్రీంకో ర్టులో పిల్‌ వేయడం దురదష్టకరమన్నారు. రాజ్యాంగ బద్ధ మైన పదవిలో ఉన్న స్పీకర్‌ సీతారాం కోర్టును ధిక్కరించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ అన్నెపు భాస్కరరావు, సనపల కొండయ్య పాల్గొన్నారు.


పాలనలో  జగన్‌ ప్రభుత్వం విఫలం

గుజరాతీపేట: రాష్ట్రాన్ని పాలించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విఫలమైందని  కాంగ్రెసు నాయకులు దుయ్యబట్టారు. బుధవారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్జాన భవనంలో  కాంగ్రెసు నాయకులు అంబటి కృష్ణ, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, భైరి రాజేశ్వరరావు, దంత త్రినాఽథరావు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులు రాజ్యాంగ, చట్ట వ్యతిరేక పాలన కాకుండా ప్రజల పక్షాన నిలబడాలన్నారు. ప్రత్యేక హోదా గురించి ఏడాదిలో ఒక్క సారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జగన్‌ ప్రశ్నించలేకపోయారని విమర్శించారు.

Updated Date - 2020-06-04T09:25:14+05:30 IST