కార్మికులపై ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ

ABN , First Publish Date - 2022-09-30T04:58:56+05:30 IST

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కి అపారమైన ప్రేమ ఉన్నదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే మల్లయ్య అన్నారు.

కార్మికులపై ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీ వెంకట్రావ్‌

- టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌

గోదావరిఖని, సెప్టెంబరు 29: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కి అపారమైన ప్రేమ ఉన్నదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే మల్లయ్య అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 30శాతం లాభాల వాటాను ప్రకటించారని, సింగరేణికి 1223కోట్ల నిరక లాభం వచ్చిందని, అందులో నుంచి 30శాతం ఇవ్వ డం జరుగుతుందని, దీనికోసం రూ.368 కోట్ల అక్టోబర్‌ 1న కార్మికుల కు చెల్లిస్తారన్నారు. ఒక్కో కార్మికునికి సరాసరిగా రూ.79,600 వస్తుం దని, గత ఏడాది లాభాలు తక్కువ వచ్చినందున ఒక్కో కార్మికునికి రూ.16500మాత్రమే వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఎక్కువ వచ్చాయని, 1వ క్యాటగిరిలో పని చేసే కార్మికులకు మస్టర్లు ఎక్కువగా ఉండి ఇన్సెంటివ్‌ వస్తే రూ.76 వేలు దాటుతాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 70మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని కార్మికులు సాధించాలని, సెప్టెంబర్‌ 30వరకు 29మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని, మార్చి 41మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్ప త్తిని సాధించాల్సి ఉందని చెప్పారు. కార్మికుల అనేక సమస్యలను టీబీజీ కేఎస్‌ పరిష్కరించిందని, కరోనా సమయంలో మెడికల్‌ బోర్డు నిర్వహించ కపోవడం వల్ల 35సంవత్సరాలు దాటిన 106 మందికి కారుణ్య నియా మకాల కింద ఉద్యోగాలు ఇప్పించామని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటాను ప్రకటిచడంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షు రాలు కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గండ్ర దామోదర్‌రావు, కనకం శ్యామ్‌సన్‌, నాయిని శంకర్‌, పుట్ట రమేష్‌, రమేష్‌ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T04:58:56+05:30 IST