రెండు రోజులపాటు జిల్లాలో ఉపాధి పనుల తనిఖీ

ABN , First Publish Date - 2021-10-28T05:56:43+05:30 IST

జిల్లాలో చేపట్టిన ఉపాధి పనులను తనిఖీ చేసేందు కు కేంద్ర బృందం వచ్చేసింది. బృందం సభ్యులు బుధవారం రా త్రి జిల్లాకు చేరుకున్నారు.

రెండు రోజులపాటు జిల్లాలో ఉపాధి పనుల తనిఖీ

కేంద్ర బృందం వచ్చేసింది..!

మూడేళ్లలో ఉపాధి నిధుల వినియోగంలో అక్రమాలు

పలు ప్రాంతాల్లో పనులకు వెళ్లకుండానే 

బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలు

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అధికారుల ప్రయత్నాలు

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 27: జిల్లాలో చేపట్టిన ఉపాధి పనులను తనిఖీ చేసేందు కు కేంద్ర బృందం వచ్చేసింది. బృందం సభ్యులు బుధవారం రా త్రి జిల్లాకు చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో ఉపాధి నిధులతో చేపట్టిన పనులను తనిఖీ చేయనున్నారు. కేంద్ర బృందంలో ఐఏఎస్‌ అధికారి రోహితకుమార్‌తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కేంద్ర బృ ందం పర్యటన నేపథ్యంలో గ్రామీణాభివృద్ది సంస్థ డైరెక్టర్‌ చిన్నతాతయ్య, జాయింట్‌ కమిషనర్లు కళ్యాణ చక్రవర్తి, శివకుమార్‌ మూడు రోజుల క్రితమే జిల్లాకు చేరుకున్నారు. కేంద్ర బృందం తనిఖీ చేసే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై స్థానిక అధికారులకు వివరించినట్లు సమాచారం. కేంద్ర బృందం ఏయే మండలాల్లో పర్యటిస్తుందన్న సమాచారాన్ని డ్వామా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.


మూడేళ్లలో నిధుల వినియోగంలో అక్రమాలు

కేంద్ర బృందం తనిఖీలు డ్వామా అధికారుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులకు వెళ్లకపోయినా స్థానిక అధికార పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది కుమ్మకై ఉపాధి బిల్లులు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్యరీతిలో పెద్దఎత్తున నిధు లు ఖర్చు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు ఎలా చేశారన్న అంశంపై కేంద్ర ప్రభుత్వానికి అనుమానం వచ్చినట్లు సమాచారం.   ఉపాధి నిధులతో చేపట్టిన పలు పనులు నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ నిధులకు గండి కొట్టారన్న విమర్శలున్నాయి. ఏటా చేపట్టే సామాజిక తనిఖీల్లోనూ ఈ అక్రమాల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకుండా అమ్యామ్యాలు పుచ్చుకుని, కప్పిపుచ్చుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జిల్లాలో తనిఖీలకు కేంద్ర బృందాన్ని పంపినట్లు సమాచారం. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆయా ఉపాధి అధికారులు, సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలిసింది. కేంద్ర బృందం సభ్యుల ఎదుట తప్పులను ఎలా కప్పిపుచ్చాలన్న దానిపై పలు రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


మూడేళ్లుగా ఉపాధి నిధుల ఖర్చు తీరిదీ..!  

ఉపాధి హామీ పథకం ద్వారా 2019-20  సంవత్సరంలో మొత్తం రూ.606.45 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 5.57 లక్షల మంది కూలీలకు 1.87 కోట్ల పని దినాలు కల్పించి, రూ.392.67 కోట్లు చెల్లించా రు. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రోడ్లు, భవన నిర్మాణాలకు రూ.213.78 కోట్లు వెచ్చించారు. 20 20-21లో మొత్తం 1018.51 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 7.68 లక్షల మంది కూలీలకు 2.80 కోట్ల పనిదినాలు కల్పించి, రూ.650.22 కోట్లు చెల్లించారు. ప్ర భుత్వ శాఖల ఆధ్వర్యంలో పలు రకాల పనులకు రూ.368.29 కోట్లు ఖర్చు చేశారు. 2021-22 సంవత్సరంలో ఇప్పటిదాకా మొత్తం రూ.657.76 కోట్లు ఖర్చు చేశారు. 6.94 లక్షల మంది కూలీలకు 2.34 కోట్ల పనిదినాలు కల్పించి, రూ.534.37 కోట్లు చెల్లించారు. ప్ర భుత్వ శాఖల ఆధ్వర్యంలో పలు రకాల పనులకు రూ.123.39 కోట్లు వెచ్చించారు.



ఏడుగురు వెలుగు సిబ్బంది అరెస్టు

ముదిగుబ్బ, అక్టోబరు 27: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (హార్టికల్చర్‌) పనుల్లో నిఽధుల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు వెలుగు సిబ్బందిని  అరెస్టు చేసినట్టు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌ తెలిపారు. ఆ వివరాలను బుధవారం స్థానిక పోలీ్‌సస్టేషనలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె.. నల్లమాడ  సీఐ య ల్లంరాజు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌తో కలిసి వెల్లడించారు. డీఆర్‌డీఏ వెలుగు ప్రాజెక్టులో ఏరియా కో-ఆర్డినేటర్‌, ఏపీఎం, సీసీ, వీఏఓలుగా 2017-18, 2018-19 ఆర్థికసంవత్సర మధ్యకాలంలో ముదిగుబ్బ మండలంలో పనిచేసిన వారు ఉపాధి నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. పండ్ల తోటల పెంపకం పనుల్లో మండలంలోని పలు గ్రామ పంచాయతీల పరిధిలో అనర్హులను లబ్ధిదారులుగా గుర్తించడం, మొక్కలు నాటేందుకు గుంతలు తీయకపోయినా.. తీసినట్టు, గతంలో ఉన్న మొక్కలను ఈ పథకం కింద నాటినట్లు చూపించడం, కొన్ని మాత్రమే నాటి ఎ క్కువ మొత్తంలో బిల్లులు చేసుకున్నారు. ఇలా రూ.3.23 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయంపై 2019 జూలై 26 నుంచి 2019 ఆగస్టు 12వ తేదీ వరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఎస్‌ఎ్‌సఏఏ బృందం మండలంలోని పలు గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి, నిధుల దుర్వినియోగా నికి పాల్పడినట్టు తేల్చారు. విచారణ అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్‌ సూచనల మేరకు క దిరి క్లస్టర్‌ ఏరి యా కో-ఆర్డినేటర్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఈ ఏడాది ఆ గస్టు 28న అక్రమాలపై ముదిగుబ్బ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చే శా రు. ఆ మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకున్నారు. నిధుల దుర్వినియోగం అధిక మొత్తంలో ఉండటంతో ఎస్పీ ఫక్కీరప్ప డీఎస్పీని విచారణాధికారిగా నియమించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10- 30 గంటల సమయంలో  ముదిగుబ్బలో పోస్టాఫీసు వీధిలోని బేతరాసి నరసింహులు ఇంటిముందు నిందితులు ఏ పీఎం కుమ్మర ఓబులేసు, సీసీలు టీడీ రఘునందన, ఎ్‌స.బాబాఫకృద్దీన, తప్పిల రమేశ, వీఓఏలు బేతారసి నరసింహులు, పార్నపల్లి నారాయణస్వామి, చిన్నదుబ్బార వెంకటనారాయణను అరెస్టు చేసినట్టు డీఎస్పీ భవ్యకిశోర్‌ తెలిపారు.

Updated Date - 2021-10-28T05:56:43+05:30 IST