కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:52:09+05:30 IST

అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షులు పవార్‌రామారావు పటేల్‌ డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌

డీసీసీ అధ్యక్షుడు పవార్‌ రామారావు పటేల్‌

భైంసా, జూన్‌ 27: అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షులు పవార్‌రామారావు పటేల్‌ డిమాండ్‌ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు సోమవారం భైంసా పట్టణంలో సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ముందుగా ఎస్‌ఎస్‌ ఫ్యాక్టరీ నుంచి వందలాది కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీగా బస్టాం డు వద్ద అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ప్లకార్డులతో కేంద్ర ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆర్డీఓ లోకేశ్వర్‌రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, కుంటాల ఎంపీపీ అప్కా గజ్జరాం, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు నగేష్‌, రాష్ట్ర నాయకులు ఆనంద్‌ రావు పటేల్‌, ఎంపీపీ రజాక్‌, భైంసా పట్టణ అధ్యక్షులు వడ్నం శ్రీనివాస్‌, నాయకులు ఫిరోజ్‌, సాయినాథ్‌, శంకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అంకితభావంతో పని చేసే వారికి పార్టీలో పదవులు

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 27 : కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు అంకితభావంతో పని చేసే వారికి పదవులు లభిస్తాయని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రామారావు పటేల్‌ పవార్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన జిల్లా కాంగ్రెస్‌ కమిటీలో పలు పదవులకు నాయకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-06-28T06:52:09+05:30 IST