రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి

ABN , First Publish Date - 2021-10-27T07:39:43+05:30 IST

దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్య మానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్లంల యాదగిరి డిమాండ్‌ చేశారు.

రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
చిలుకూరులో రాస్తారోకో చేస్తున్న రైతుసంఘం నాయకులు

జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నిరసనలు

తిరుమలగిరి, అక్టోబరు 26: దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్య మానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్లంల యాదగిరి డిమాండ్‌ చేశారు. తిరుమలగిరిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండీ యాకూబ్‌, సోమిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు. 

నేరేడుచర్ల:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల మృతి ఘటనలో  కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండటం సిగ్గుచేటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయనాయుడు అన్నారు. అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించా లన్నారు.  రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వ హించిన  ఽధర్నాలో ఆయన మాట్లాడారు అనంతరం తహసీల్దార్‌ సరితకు వినతి పత్రం అందజేశారు. ఈ  కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, నాయకులు ఎల్లబోయిన సింహా ద్రి, లక్ష్మి, కటికోల వెంకన్న, కొండ అంజయ్య, దాసోజు వెంకటాచారి, రణపంగ శ్రీనివాస్‌, బొడ్డుపల్లి శ్రీను, బాలు, రవీందర్‌రెడ్డి, శివ, గోపి పాల్గొన్నారు.

సూర్యాపేట టౌన్‌: లఖింపూర్‌ కేరీ ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని వామపక్షాల నాయకులు ములకలపల్లి రాములు,మండారి డేవిడ్‌, కుంట్ల దర్మార్జున్‌, కొత్తపల్లి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి మాట్లాడారు.  లఖింపూర్‌ ఘటనలో మృతిచెందిన రైతు కుటుంబాలతో పాటు గాయపడిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతాంగ ఉద్య మాన్ని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురగుంట్ల లక్ష్మయ్య, కోట రమేష్‌, బుద్ధ సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, కొలిశెట్టి యాదగిరిరావు, నవీన్‌, స్వరాజ్యం, రవి, శేఖర్‌, మోహన్‌రెడ్డి, వెంకన్న, కిరణ్‌కుమార్‌, సైదులు, యల్లయ్య, ఆరుట్ల శంకర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరు: రైతు వ్యతిరేక  చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ధర్నా చేస్తున్న రైతులకు  ప్రజలు మద్దతుగా నిలబడాలని సీపీఐ అనుబంధ రైత ుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డా వెంకటయ్య కోరారు. మండల కేంద్రంలో మంగళవారం రైతుసంఘం ఆధ్వర్యంలో కోదాడ–హుజూర్‌నగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల ర్యాలీపై వాహనాన్ని నడిపి రైతుల మృతికి కేంద్ర సహాయమంత్రి కుమారుడు కారకుడు అవడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనకు కేంద్ర సహాయ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో కస్తూరి సత్యం, పిల్లుట్ల కనకయ్య, మొక్కా లక్ష్మీనారాయణ, అంజయ్య, బెల్లంకొండ ఉపేందర్‌, గంగాధర్‌, దశరధ, రవి, జనార్ధన్‌, నాగేశ్వరరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T07:39:43+05:30 IST