కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

ABN , First Publish Date - 2021-10-17T06:26:38+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు

కూర్మన్నపాలెం, అక్టోబరు 16: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 247వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కోరారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 19 నాటికి 250 రోజులు ఉద్యమం పూర్తవుతున్న నేపథ్యంలో 250 మంది కార్మికులతో 25 గంటలు పాటు నిరాహార దీక్ష చేస్తామన్నారు.  ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, నీరుకొండ రామచంద్రరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:26:38+05:30 IST