ఏపీపై కేంద్రం సీరియస్

ABN , First Publish Date - 2021-11-27T20:24:09+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు.

ఏపీపై కేంద్రం సీరియస్

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీని కేంద్రం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా కేంద్ర గణాంకాలు, ప్రణాళికా మంత్రిత్వ శాఖ లేఖలు పంపింది.


ఏపీకి చెందిన ఎంపీ నందిగం సురేష్ ఒక చర్చి నిర్మాణానికి రు.40 లక్షలకుపైగా నిధులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలతో ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. రఘురామ రాసిన లేఖపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల క్రితం గణాంకాలు, ప్రణాళిక శాఖ లేఖ పంపింది. అప్పటి నుంచి స్పందించక పోవడంతో ఏపీ సీఎస్‌కు గుర్తు చేస్తూ గణాంకాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమ్య మరో లేఖ పంపారు. వీలైనంత త్వరగా సవివరమైన నివేదిక పంపాలని ఇరువురి పంపిన లేఖలో గణాంకాల శాఖ కోరింది. 

Updated Date - 2021-11-27T20:24:09+05:30 IST