రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-15T05:21:11+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుతూ... రైతుల నడ్డి విరుస్తున్న దని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
పెంచిన ధరలకు నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- బీజేపీకి హఠాహో... కిసాన్‌కు బచాహో

- ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎరువుల ధర పెంపుపై కేటీదొడ్డిలో ధర్నా

గద్వాల, జనవరి 14: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుతూ... రైతుల నడ్డి విరుస్తున్న దని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.  బీజేపీని హఠాహో.. కిసాన్‌కు బచాహో అంటూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం రైతు బీమా, రైతు బంధు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతును రాజు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతుల ఆదా యాన్ని కొల్లగొడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభు త్వం వ్యవసాయ రంగాన్ని  కార్పొరేట్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నదని, అందుకు అనుగుణం గా రైతు చట్టాలను తీసుకవచ్చి రైతుల ఆగ్రహానికి గురై వెనక్కి తగ్గిందని విమర్శించారు.  ఒక్క ఎరువుల నే కాకుండా వాటికి అనుబంధమైన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను కూడా తగ్గించాలని ఆయన డిమాండ్‌ చే శారు. ఈ సందర్భంగా ఎరువు బస్తాలను రోడ్డుపై వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ్మ, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణ నాయుడు,  రైతుబంధు మండల అధ్యక్షుడు హనుమంతు, పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, నాయకులు చక్రధర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-15T05:21:11+05:30 IST