Edible Oil Price: హమ్మయ్య.. వంటనూనెల ధరలపై ఈ తాజా విషయం మిమ్మల్ని ఖుషీ చేస్తుంది..

ABN , First Publish Date - 2022-05-02T20:41:01+05:30 IST

వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం కాస్తంత ఊరట కలిగించే విధంగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంటనూనెల దిగుమతిపై విధించే సెస్‌ను తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదేగానీ జరిగితే..

Edible Oil Price: హమ్మయ్య.. వంటనూనెల ధరలపై ఈ తాజా విషయం మిమ్మల్ని ఖుషీ చేస్తుంది..

న్యూఢిల్లీ: వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం కాస్తంత ఊరట కలిగించే విధంగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంటనూనెల దిగుమతిపై విధించే సెస్‌ను తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదేగానీ జరిగితే రాకెట్‌లా దూసుకెళుతున్న వంట నూనెల ధరలు కాస్తంత తగ్గే అవకాశం ఉంది. వినియోగదారుడికి ఊరట లభించేందుకు ఆస్కారం ఉంటుంది. భారత్‌లో వినియోగించే వంటనూనెల్లో దాదాపు సగం వరకూ ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతుంది. అయితే.. ఉన్నట్టుండి ఇండోనేషియా Palm Oil, Crude Oil ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్‌లో వంటనూనెకు డిమాండ్ పెరిగింది. సప్లయ్ తగ్గి డిమాండ్ పెరగడంతో వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి.



వంటనూనెల ధరలను తగ్గించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో కేంద్రం ఆ ఆలోచన దిశగా అడుగులేస్తున్నట్లు తెలిసింది. వంటనూనెల దిగుమతులపై 5 శాతం వరకూ అగ్రి సెస్‌ను తగ్గించాలని Ministry Of Consumer Affairs ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇండోనేషియా తర్వాత వంటనూనెలను భారత్ ఎక్కువగా మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మలేషియా ఇప్పటికే డిమాండ్‌కు తగ్గట్టుగా ఆయిల్‌ను సప్లయ్ చేయడంలో విఫలమైంది. పామాయిల్ ఎగుమతి చేసే దేశాల్లో ప్రపంచంలోనే ఇండోనేషియాది అగ్రస్థానం. కానీ.. ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో వంటనూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

Updated Date - 2022-05-02T20:41:01+05:30 IST