Abn logo
Jun 5 2020 @ 05:05AM

కేంద్రం నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలి

ఎన్జీవో సంఘం నిరసన


నెల్లూరు(హరనాథపురం), మే 4 : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రావు డిమాండ్‌ చేశారు.  అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట గురువారం భోజన విరామ సమయంలో ఎన్జీవో సంఘం నేతలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లపాటు డీఏను ఫ్రీజ్‌ చేస్తామని, కార్మక చట్టాలను సవరిస్తామని ప్రకటించటం బాధాకరం అన్నారు. ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకోకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నందిమండలం ఆంజనేయవర్మ, ఎన్‌ గిరిధర్‌, జీ రమేష్‌బాబు, ఎల్‌ పెంచలయ్య, కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement