Assembly seats: ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత

ABN , First Publish Date - 2022-07-27T20:10:24+05:30 IST

ఏపీ(AP), తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది.

Assembly seats: ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత

న్యూఢిల్లీ: ఏపీ (AP), తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్థానాల (Assembly seats) పెంపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. అసెంబ్లీ స్థాలన పెంపుపై రాజ్యసభ (Rajyasabha)లో బీజేపీ (BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని  కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ (Nityananda rai) తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153కి అసెంబ్లీ స్థానాలు పెంపు ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-27T20:10:24+05:30 IST