ఢిల్లీ: గిరిజన రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం అంటోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో గిరిజన వర్సిటీపై కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించారన్నారు. కానీ కేంద్రం మాత్రం ప్రతిపాదన రాలేదంటోందన్నారు. అసలు విషయం తప్పుదోవ పట్టే విధంగా హరీశ్‌రావు ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఏనాడు తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో గిరిజన రిజర్వేషన్ల అంశంపై స్పందించలేదన్నారు. పార్లమెంట్ జీరో అవర్‌లో, రూల్ 377 కింద గిరిజన రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించినా ఇదే సమాధానం వచ్చిందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి