రెస్టారెంట్‌కు వెళ్లి మద్యం, ఆహారం కావాలన్నాడు.. డబ్బులు కట్టమని అడిగినందుకు ఆ పోలీస్ అధికారి ఎంత ఆగ్రహానికి గురయ్యాడంటే..

ABN , First Publish Date - 2021-12-24T22:30:34+05:30 IST

అతను ముంబైలోని ఓ పోలీస్ అధికారి.. అన్యాయాన్ని అరికట్టాల్సిన ఆ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు..

రెస్టారెంట్‌కు వెళ్లి మద్యం, ఆహారం కావాలన్నాడు.. డబ్బులు కట్టమని అడిగినందుకు ఆ పోలీస్ అధికారి ఎంత ఆగ్రహానికి గురయ్యాడంటే..

అతను ముంబైలోని ఓ పోలీస్ అధికారి.. అన్యాయాన్ని అరికట్టాల్సిన ఆ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక బార్‌కు వెళ్లి తన పోలీస్ జులుం చూపించాడు.. క్యాషియర్‌ను చితకబాదాడు.. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి.. బార్ యాజమాన్యం ఆ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది.. దీంతో నిందితుడిని సస్పెండ్ చేసిన ఎస్పీ, విచారణకు ఆదేశించారు.. ముంబైలోని వంకోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ముంబైలోని వంకోలా పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ పాటిల్ అనే వ్యక్తి అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి 12.30 గంటలకు తన స్టేషన్ పరిధిలో ఉన్న స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అప్పటికి ఆ రెస్టారెంట్ క్లోజ్ అయి ఉంది. సిబ్బంది అంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. క్యాషియర్ రామ్‌‌దాస్ దగ్గరకు వెళ్లిన విక్రమ్ తనకు ఉచితంగా మద్యం, ఆహారం కావాలని అడిగాడు. అందుకు రామ్‌దాస్ తిరస్కరించాడు. 


ఆగ్రహానికి గురైన విక్రమ్.. రామ్‌దాస్‌పై దాడికి తెగబడ్డాడు. అతడిపై చేయి చేసుకున్నాడు. ఆ ఘటన బార్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయింది. ఆ ఘటనపై గురువారం ఉదయం బార్ యజమాని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్పీ.. విక్రమ్‌ను విధుల నుంచి తప్పించారు. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపి విక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-12-24T22:30:34+05:30 IST