కోతిని తప్పించబోయి కారు బోల్తా

ABN , First Publish Date - 2021-01-19T06:34:09+05:30 IST

కోతిని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది.

కోతిని తప్పించబోయి కారు బోల్తా

సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఘటన

సూర్యాపేటరూరల్‌, జనవరి 18: కోతిని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో  65వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చెందిన బుచ్చిబాబు కారులో హైదరాబాద్‌కు వెళుతుండగా టేకుమట్ల సమీపంలో కోతి అడ్డువచ్చింది. దీంతో కోతిని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా పడింది.  కారులో ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో బుచ్చిబాబు స్వల్ప గాయలతో బయటపడ్డాడు. బుచ్చి బాబును  పోలీసులు సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2021-01-19T06:34:09+05:30 IST