కారు చవకగా..

ABN , First Publish Date - 2022-01-08T05:36:37+05:30 IST

వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా ఇబ్బంది లేదంటారు. అలాగే అధికారంలో మనోడు ఉంటే మార్కెట్‌ ధరకన్నా అతి చవకగా భూములు దక్కించుకోవచ్చనేది ఇప్పుడు చూస్తున్నాం. రిమ్స్‌ వద్ద ఐటీ పార్కుకు కేటాయించిన 52.76 ఎకరాల భూమిని కారు చవకగా ఓ ట్రాన్సఫార్మర్ల తయారీ సంస్థకు కట్టబెట్టడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

కారు చవకగా..
రిమ్స్‌ సమీపంలో రింగ్‌రోడ్డుకు ఆనుకుని వైఎస్‌ హయాంలో ఏర్పాటు చేసిన సీపీబ్రౌన ఇన్ఫర్మేషన టెక్నాలజీ సిటీ

వైఎ్‌సఆర్‌ హయాంలో ఐటీ కంపెనీలకు రిమ్స్‌ వద్ద 53 ఎకరాల కేటాయింపు

సీపీ బ్రౌన ఇన్ఫర్మేషన టెక్నాలజీ సిటీగా నామకరణం

తాజాగా ట్రాన్సఫార్మర్‌ తయారీల కంపెనీకి అప్పగింత

మార్కెట్‌ ధర ఎకరం రూ.2 నుంచి రూ.3 కోట్లు 

అయితే రూ.65 లక్షలకే అప్పగింత

తండ్రి సంకల్పానికి తనయుడు మంగళం

కడప, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా ఇబ్బంది లేదంటారు. అలాగే అధికారంలో మనోడు ఉంటే మార్కెట్‌ ధరకన్నా అతి చవకగా భూములు దక్కించుకోవచ్చనేది ఇప్పుడు చూస్తున్నాం. రిమ్స్‌ వద్ద ఐటీ పార్కుకు కేటాయించిన 52.76 ఎకరాల భూమిని కారు చవకగా ఓ ట్రాన్సఫార్మర్ల తయారీ సంస్థకు కట్టబెట్టడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. 

్ఝ దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది.  జిల్లా కేంద్రంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఐటీ కొలువులు వస్తాయని వైఎస్సార్‌ భావించారు. బెంగళూరు, చెన్నై మెట్రో సిటీలు కడపకు దగ్గరల్లో ఉన్నాయని దీంతో ఐటీ సంస్థలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకుంటాయనే ఉద్దేశంతో రిమ్స్‌ సమీపంలో 52.76 ఎకరాలను కేటాయించారు. ప్రధాన రహదారులు, భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. దీనికి సీపీబ్రౌన ఇన్ఫర్మేషన టెక్నాలజీ సిటీగా నామకరణం చేయడంతో జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తాయి. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కడపలోనే కొలువులు దొరుకుతాయని కలగన్నారు. అయితే వైఎస్సార్‌ మరణానంతరం ఐటీ పార్క్‌ కలగానే మిగిలిపోయింది.


ఐటీ హబ్‌ అంటూనే..

కడపను ఐటీ హబ్‌గా మారుస్తామంటూ కడప నేతలు ఎన్నికల్లో హామీ ఇస్తూ వచ్చారు. వైఎస్‌ జగన సీఎం కావడంతో ఐటీ పార్క్‌పై జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తాయి. తండ్రి సంకల్పాన్ని తనయుడు ముందుకు తీసుకెళతాడని భావించారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను షిరిడీ సాయి ఎలక్ర్టానిక్‌ సంస్థకు ఎకరా రూ.68 లక్షలకు కట్టబెట్టింది. ఇటీవల రిమ్స్‌ పరిసరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. రిమ్స్‌, సింగపూర్‌ సిటీ, క్రికెట్‌ స్టేడియం, జర్నలిస్టు కాలనీ, శిల్పారామం, రింగ్‌రోడ్డు, స్పోర్ట్స్‌ స్కూల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, రింగ్‌రోడ్డు సౌకర్యం ఉండడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల పైగానే ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. రింగ్‌ రోడ్డు చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ జోరుగా సాగుతోంది. ఇక్కడ ఐటీ పార్క్‌కు కేటాయించిన భూములు రింగ్‌ రోడ్డు దగ్గరే ఉన్నాయి. ఐటీ పార్క్‌ వచ్చింటే ఐటీ టవర్లతో ఆ ప్రాంతం మరో న్యూ కడప సిటీగా కనిపించి ఉండేది. ఒక పక్క రిమ్స్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు, మరో పక్క ఐటీ ఉద్యోగులతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయేవి. ప్రస్తుతం ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం కోటిన్నర పైనే ఉంటుందని అంటుంటారు. అయినప్పటికీ ఎకరా రూ.68 లక్షలకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఇక్క ఐటీ పార్కు ఏర్పాటు చేయకపోగా ఇంత తక్కువకు 53 ఎకరాలు కేటాయించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.




Updated Date - 2022-01-08T05:36:37+05:30 IST