విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా కదల్చలేదని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మార్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడితే కుదరదని ఆయన మండిపడ్డారు. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానంతో రాజధాని ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి