Abn logo
Sep 27 2021 @ 01:53AM

పండగ సీజన్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి

ఐపీఓలకు 30 కంపెనీలు.. రూ.45,000 కోట్ల సమీకరణ లక్ష్యం 

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌ జోష్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు. వచ్చే రెండు నెలల్లో (అక్టోబరు-నవంబరు) 30 కంపెనీలు దాదాపు రూ.45,000 కోట్ల సమీకరణ కోసం ఐపీఓలు జారీ చేయబోతున్నాయి. ఇందులో ఎక్కువ వాటా టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే అవుతుందని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. నిన్న మొన్నటి వరకు టెక్నాలజీ ఆధారిత కంపెనీలు.. ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి నిధులు సమీకరించేవి.


జొమాటో ఐపీఓకు లభించిన ఆదరణతో, ఇప్పుడు ఈ కంపెనీలూ నిధుల సమీకరణ కోసం ఐపీఓల బాట పట్టాయి. వచ్చే రెండు నెలల్లో పాలసీబజార్‌ (రూ.6,017 కోట్లు), ఎమ్‌క్యూర్‌ పార్మా (రూ.4,500 కోట్లు), నైకా (రూ.4,000 కోట్లు), సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ (రూ.2,000 కోట్లు), మొబిక్విక్‌ సిస్టమ్స్‌ (రూ.1,900 కోట్లు) వంటి అనేక ప్రముఖ కంపెనీలు ఐపీఓలు జారీ చేయబోతున్నాయి.