దూసుకుపోతున్న ‘వాసవీ’ గ్రూప్‌

ABN , First Publish Date - 2022-01-15T08:22:58+05:30 IST

వాసవీ గ్రూప్‌ స్థిరాస్తి రంగానికి కొత్త నిర్వచనం చెబుతోంది.

దూసుకుపోతున్న ‘వాసవీ’ గ్రూప్‌

27 ఏళ్లలో ఎన్నో వెంచర్లు

వాసవీ గ్రూప్‌ స్థిరాస్తి రంగానికి కొత్త నిర్వచనం చెబుతోంది. 1994లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన వాసవీ గ్రూప్‌ గత 27 సంవత్సరాల్లో 47 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఇందులో 30 నివాస ప్రాజెక్టులు, 17 మాత్రం వాణిజ్య ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల్లో వాసవీ గ్రూప్‌ 80 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేసింది. కంపెనీ 310 ఎకరాల్లో ఏర్పాటు చేసిన విల్లాల ప్లాట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల వాసవీ గ్రూప్‌ నిర్మించిన 4,510 అపార్ట్‌మెంట్లలో ఇప్పటికే 25,000 మంది నివాసం ఉంటున్నారు. వచ్చే ఐదేళ్లలో నివాస, వాణిజ్య అవసరాల కోసం ఐదు కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2022-01-15T08:22:58+05:30 IST