Abn logo
Oct 17 2021 @ 00:49AM

జగిత్యాలలో యువకుడి దారుణ హత్య

తోట శేఖర్‌(ఫైల్‌)

- పాత కక్షలే కారణమని అనుమానం

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 16: జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమా న్‌వాడకు చెందిన తోట శేఖర్‌ (27) అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్‌ సెంట్రింగ్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బీట్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న ఓ పాస్ట్‌పుడ్‌ సెంటర్‌ లో శేఖర్‌ తన స్నేహితులతో కలిసి విందు చేసుకున్నారు.  మద్యం మత్తులో ఉన్న శేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో శనివారం ఉదయం సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌, టౌన్‌ ఇన్స్‌ఫెక్టర్‌ కిషోర్‌ శేఖర్‌ మృతదేహాన్ని పరిశీలిం చారు. హత్యకు పాల్పడింది సమిండ్ల మహేష్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హత్యకు పాల్ప డింది ఒకరేనా ఇంకా ఏవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య స్వప్న, తల్లిదండ్రులు  రమేష్‌, గంగులు మాత్రం తన కుమారు డిని పాత కక్షలతోనే మహేష్‌ హత్య చేసినట్టు ఆరోపిస్తున్నారు. మృతుడికి ఓ హత్య కేసుతో పాటు దాడి కేసులో నిం దితుడిగా ఉండగా రౌడీషీట్‌ తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.