‘‘ఆ ఒక్క కోరికను నెరవేరిస్తేనే పెళ్లి చేసుకుంటా’’.. ఈ వధువేంటీ! ఇలాంటి కండీషన్ పెట్టింది..

ABN , First Publish Date - 2022-02-02T22:42:48+05:30 IST

టీవల కొందరు పెళ్లికుమార్తెలు సరదా సరదాగా చిందులేసే వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పెళ్లికూతురు విచిత్ర కండీషన్ పెట్టి వార్తల్లో నిలిచింది...

‘‘ఆ ఒక్క కోరికను నెరవేరిస్తేనే పెళ్లి చేసుకుంటా’’.. ఈ వధువేంటీ! ఇలాంటి కండీషన్ పెట్టింది..

వివాహ కార్యక్రమంలో చిందులు, విందులు సహజమే. స్నేహితులతో కలిసి వరుడు కూడా చిందులేయడం చూస్తుంటాం. కానీ చాలా మంది పెళ్లి కుమార్తెలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఆ సమయంలో సిగ్గు, బిడియంతో ఉండేవారినే ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇటీవల కొందరు పెళ్లికుమార్తెలు సరదా సరదాగా చిందులేసే వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పెళ్లికూతురు విచిత్ర కండీషన్ పెట్టి వార్తల్లో నిలిచింది. తన కోరికను నెరవేరిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ షరతు పెట్టింది. చివరకు తన పంతం నెగ్గించుకుంది.


మధ్యప్రదేశ్ భోపాల్‌ జిల్లా బైరాగఢ్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువతి పెళ్లి సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాట్లను ఘనంగా చేశారు. భోపాల్‌‌సంత్‌ హిర్దారామ్‌నగర్‌‌లో ఉన్న తన అత్తగారి ఇంటి వరకూ ఊరేగింపు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అంతా సిద్ధం చేశాక.. పెళ్లికుమార్తె ఒక కండీషన్ పెట్టింది. తనకు ఓపెన్ టాప్ జీప్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తూ వెళ్లాలని ఉందంటూ.. తన మనసులోని కోరికను బయటపెట్టింది.

అక్కడి ఆలయంలో శివుడికి పీతలతో అభిషేకం.. అదెక్కడో, అలా ఎందుకు చేస్తారో తెలుసా..?


ఇదేం వింత కోరిక అంటూ మొదటగా సందేహించిన కుటుంబ సభ్యులు.. ఎట్టకేలకు ఒప్పుకొన్నారు. దీంతో పెళ్లికూతురు గెటప్‌లో ముస్తాబైన యువతి.. జీప్‌ బ్యానెట్‌పై కూర్చుని సరదాగా చిందులేస్తూ.. పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లింది. ఈ ఘటనను మొత్తం స్థానిక యువకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వరకట్నం నిరాకరించిన వరుడు.. వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన విధించాడో తెలుసా..



Updated Date - 2022-02-02T22:42:48+05:30 IST