మా చెల్లికి ఇక్కడ పరీక్ష ఉందని చెప్పిన నవవధువు.. బస్టాండ్‌కు వెళ్లి మరీ ఇంటికి తీసుకొచ్చిన భర్త.. సాయంత్రానికి షాకింగ్ దృశ్యం..!

ABN , First Publish Date - 2022-05-28T18:02:36+05:30 IST

రెండేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది.. ఇద్దరు పిల్లలు, ముసలి తల్లితో కలిసి అతను నివసిస్తున్నాడు..

మా చెల్లికి ఇక్కడ పరీక్ష ఉందని చెప్పిన నవవధువు.. బస్టాండ్‌కు వెళ్లి మరీ ఇంటికి తీసుకొచ్చిన భర్త.. సాయంత్రానికి షాకింగ్ దృశ్యం..!

రెండేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది.. ఇద్దరు పిల్లలు, ముసలి తల్లితో కలిసి అతను నివసిస్తున్నాడు.. పిల్లలను, తల్లిని చూసుకునేందుకు తోడు కావాలని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. మధ్యవర్తికి రూ.1.50 లక్షలు చెల్లించి మంచి సంబంధం చూడమన్నాడు.. మధ్యవర్తి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించాడు.. ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్లి ఫిక్సయింది.. పెళ్లి షాపింగ్, బంగారం పేరుతో అతను చాలా డబ్బు ఖర్చు చేశాడు.. వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.. తీరా చూస్తే పెళ్లి జరిగిన తర్వాతి రోజు నవ వధువు డబ్బు, బంగారంతో పరారైంది.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. పెళ్లిమంటపంలో నిరీక్షిస్తున్న వరుడు.. ఆమె ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..


హర్యానాలోని రేవారికి చెందిన రామచంద్ర అనే వ్యక్తి భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. పిల్లలను చూసుకునేందుకు తోడు కావాలని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం మధ్యవర్తిని ఆశ్రయించి రూ.1.50 లక్షలు చెల్లించాడు. అతను ఆగ్రాకు చెందిన ఖుష్బూ అనే యువతితో రామచంద్రకు పెళ్లి ఫిక్స్ చేశాడు. పెళ్లికి ముందే ఆ మహిళ రామచంద్ర ఇంటికి చేరుకుంది. పెళ్లి షాపింగ్ అంటూ రామచంద్ర చేత రూ.లక్ష ఖర్చు పెట్టించింది. అనంతరం ఈ నెల 20న వారి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఇంటి నుంచి పారిపోయేందుకు మంచి స్కెచ్ వేసింది. 


తన సోదరికి ఈ ఊరిలో పరీక్ష ఉందని, అయిపోయిన తర్వాత ఆమెను ఇంటికి తీసుకురావాలని భర్తకు చెప్పింది. దీంతో భర్త పరీక్షా కేంద్రానికి వెళ్లి ఖుష్బూ సోదరిని ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం సమయంలో ఇద్దరూ బయటకు వెళ్లి వస్తామని చెప్పారు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఇంట్లో ఉండాల్సిన బంగారం, డబ్బులు మాయమ్యాయి. దీంతో రామచంద్రకు విషయం అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.   

Updated Date - 2022-05-28T18:02:36+05:30 IST